ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి
● బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు,
ఎంపీ డీకే అరుణ
జనగామ రూరల్: ప్రశ్నించే గొంతుక, పోరాడే వ్యక్తి పులి సరోత్తం రెడ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. 36 సంవత్సరాలుగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్‌లో ఉ న్న డీఏల విషయంలో పోరాటం చేస్తున్నారన్నారు. పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ని లదీస్తూ ఉద్యమిస్తున్న పులి సరోత్తం రెడ్డికి మొ దటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరా రు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సరికొండ విద్యాసాగర్ రెడ్డి, ఉడుగుల రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్, పట్టణ అధ్యక్షుడు అనిల్, మహంకాళి హరిచంద్రగుప్త, పజ్జురి లక్ష్మీ నరసయ్య, గుజ్జుల నారాయణ, సంతోష్, గోధుమల అశోక్, డాక్టర్ భిక్షపతి శశిధర్, బింగి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
నిత్యావసర వస్తువుల
ధరలు తగ్గించాలి
జనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌నను సవరించి నిత్యావసర వస్తువు ధరలు తగ్గించాలని కోరుతూ మంగళవారం జిల్లా కేంద్రంలో సీపీఐ, సీపీఎం పార్టీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న మాట్లాడుతూ.. పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రజలపై భారాలు వేసి కార్పొరేట్ శక్తులకు దేశాన్ని దోచిపెట్టే విధంగా బడ్జెట్ ఉందని మండిపడ్డారు. తెలంగాణ విభజన చట్టంలోని హామీలు అమలు చేయడానికి నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికై నా బడ్జెట్‌ను సవరించి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జోగు ప్రకాష్, అహల్య, యాదగిరి, శేఖర్, బూడిద గోపి, సుంచు విజేందర్, ఐలయ్య, మధు, చంద్రయ్య, సుమ, కనకచారి, తదితరులు పాల్గొన్నారు.
ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి
Comments
Please login to add a commentAdd a comment