సిద్ధులగుట్టలో చారిత్రక ఆనవాళ్లు
బచ్చన్నపేట: ఆలయాల చరిత్రను కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలని, అప్పుడే వాటి వైభవాలను తెలియజేసిన వారిమవుతామని సామాజిక కవి, రచయిత, ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ ఎక్కలదేవి మోహన కృష్ణ భార్గవ అన్నారు. మంగళవారం మండలంలోని కొడవటూర్ గ్రామంలోని స్వయంభూ సిద్ధేశ్వరాలయ క్షేత్ర చరిత్రపై పరిశోధనాత్మక వ్యాస సంకలన కరపత్రాన్ని ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధుల గుట్టలో అనేక చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దాశ్రమం సుదానంద స్వామి, ఆలయ అర్చకులు ఓం నమఃశివాయ, తహసీల్దార్ ప్రకాష్‌రావు, సీఐ అబ్బయ్య, ఎంపీడీఓ మల్లికార్జున్, ఈఓ చిందం వంశీ, ఆలయ చైర్మన్ మల్లారెడ్డి, విశ్వహిందూ పరిషత్ మండల ప్రముఖ్ కొత్తపల్లి రాజయ్య, జనగామ నగర ప్రముఖ్ అంబటి బాలరాజు, సహాయ కార్యదర్శి చిలువేరు హర్షవర్ధన్, రాజేశ్వర్ బార్గవ, చక్రాల పోచన్న, నక్క సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కవి, రచయిత, ఆధ్యాత్మిక వేత్త
మోహన కృష్ణ భార్గవ
Comments
Please login to add a commentAdd a comment