నాణ్యమైన భోజనం అందించాలి
స్టేషన్‌ఘన్‌పూర్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ శివారులో పల్లగుట్ట క్రాస్‌రోడ్డు సమీపంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను అదనపు కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, నాణ్యతను పాటిస్తున్నారా తదితర వివరాలను ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంఆర్‌ఐ శ్రీకాంత్, ప్రిన్సిపాల్ కృతమూర్తి, పీడీ కిషన్ తదితరులున్నారు.
జఫర్‌గఢ్ గురుకుల పాఠశాలలో..
జఫర్‌గఢ్: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పని తీరు, భోజనశాలలో వంటకాలు, కూరగాయలు ఇతర నిత్యావసర సరుకులు, పాఠశాల పరిసరాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ నిధులను పాఠశాల అభివృద్ధి, విహారయాత్రకు వినియోగించుకోవాలన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. మెను విషయంలో నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, తహసీల్దార్ శంకరయ్య, ఎంపీడీఓ సుమన్, ప్రిన్సిపాల్ వరలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్
నాణ్యమైన భోజనం అందించాలి
Comments
Please login to add a commentAdd a comment