టీచర్ల, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి
కేయూ క్యాంపస్: వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బరిలో నిలిచిన తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి అభ్యర్ధించారు. మంగళవారం హనుమకొండలోని ఆర్ట్స్‌అండ్ సైన్స్ కాలేజీలో తొలుత ప్రిన్సిపాల్ జ్యోతిని కలిశారు. అనంతరం పలువురు అధ్యాపకులతో మాట్లాడారు. తనను టీచర్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండలిలో గళమెత్తుతానని, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన వెంట యూనియన్ బాధ్యులు డాక్టర్ కుందూరు సుధాకర్, ఎస్‌కె మీరుద్దీన్ ఉన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment