పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
స్టేషన్‌ఘన్‌పూర్: విద్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. శనివారం ఘన్‌పూర్ శివారులోని ప్రభు త్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా సోషల్ వెల్ఫేర్ పాఠశాల, కళాశాలకు చెందిన వంటగది, ల్యాబ్, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశా లలో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. తాగునీరు సమస్య లేకుండా చూ డాలని, మరుగుదొడ్ల మరమ్మతు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించారు. పా రిశుద్ధ్యం పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయ న వెంట కమిషనర్ రవీందర్, ఎంపీడీఓ విజయశ్రీ, తదితరులు ఉన్నారు.
అడిషనల్ కలెక్టర్ పింకేష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment