అదనపు కలెక్టర్‌కు మంత్రి పరామర్శ
రఘునాథపల్లి: మాతృమూర్తిని కోల్పోయిన ములుగు అదనపు కలెక్టర్ చీమలపాటి మహేందర్‌జీ కుటుంబాన్ని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి దనసరి సీతక్క పరామర్శించారు. మహేందర్‌జీ తల్లి రాధాబాయి(80) ఈ నెల 14న మృతి చెందారు. సమాచారం అందుకున్న మంత్రి శనివారం రఘునాథపల్లి మండల కేంద్రంలోని మహేందర్‌జీ నివాసానికి వెళ్లి అతని తల్లి రాధాబాయి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ తండ్రి మాజీ సర్పంచ్ మల్లాజీని, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాడ సానుభూతిని తెలిపారు. మంత్రి వెంట పీఏసీఎస్ చైర్మన్ చీమలపాటి రవీందర్‌జీ, జక్కుల వేణుమాదవ్, మినుముల యాదవరెడ్డి, బుస్సారి బాను, వెంకట్‌రెడ్డి, వీరేందర్, శ్రీను ఉన్నారు. అయితే అదనపు కలెక్టర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన మంత్రి సీతక్కకు అక్కడి స్థానిక పార్టీ నాయకులు రాకపోవడంతో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎవరూ లేరా? అని ఆరాతీసింది.
గణితంలో పానగంటి శారదకు డాక్టరేట్
జనగామ: జిల్లా కేంద్రానికి చెందిన పానగంటి శారదకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఆమె గణితంలో ‘క్రైటీరియా ఫర్ ఓసిలేషన్ ఆఫ్ డిలే డిఫరెన్సల్ ఈక్వేషన్’ అనే అంశంపై ప్రొఫెసర్ వి.ధర్మయ్య పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. 2017–18 సంవత్సరంలో పీహెచ్‌డీ అడ్మిషన్ పొందిన శారద ప్రస్తుత నెలలో ఫైనల్ వైవా విజయవంతంగా పూర్తి చేయగా వర్సిటీ డాక్టరేట్ పట్టా అందజేసింది. భర్త ఉపేందర్ ప్రోత్సాహంతోనే డాక్టరేట్ సాధించగలిగానని శారద తెలిపారు.
మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక
జనగామ: మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ జిల్లా కమిటీని శనివారం పట్టణంలో జరిగిన సమావేశంలో కరాటే, కుంగ్‌ఫూ, టైక్వాండో సీనియర్ మాస్టర్లు ఎండీ సలీం పాషా, పెసరు సారయ్య ల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జి ల్లా అధ్యక్షుడిగా విక్టరీ షోటోకాన్ కరాటే అకాడమీకి చెందిన మాస్టర్ ఓరుగంటి సంతోష్ కు మార్, ప్రధాన కార్యదర్శిగా మాస్టర్ ఎండీ అ బ్బాస్, కోశాధికారిగా మాస్టర్ ప్రణయ్‌లను ఎ న్నుకున్నారు. జిల్లా అస్మో చైర్మన్‌గా మాస్టర్ ఎండీ.సలీం పాషా, అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా మాస్టర్ పెసరు సారయ్య, ఉపాధ్యక్షులుగా వంగ శ్రీనివాస్, బి.బాలుకుమార్, బెజరమైన శ్రీని వాస్‌లను ఎన్నుకున్నారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
అదనపు కలెక్టర్‌కు మంత్రి పరామర్శ
అదనపు కలెక్టర్‌కు మంత్రి పరామర్శ
Comments
Please login to add a commentAdd a comment