బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు జరిగే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో జనగామ డీసీపీ రాజహేంద్రనాయక్‌తో కలిసి పాల్గొన్నారు. భక్తులకు తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయాలని, ఫుడ్ సేఫ్టీ అధికారులు నిత్యం లడ్డూ, ప్రసాదాలను పరీక్షించాలని చెప్పారు. భక్తులకు నాణ్యతతో కూడిన అభిషేకం సామగ్రి సరఫరా చేయాలని ఆదేశించారు. ఆంజనేయులు అనే బినామీ దారుడు పూజా సామగ్రి విక్రయిస్తున్నాడని, అతను గతంలో దేవస్థానానికి టెండర్ డబ్బులు ఎగ్గొట్టినట్లు సమావేశం దృష్టికి తీసుకురావడంతో బకాయి చెల్లించకుంటే ఆస్తులు జప్తుచేయాలని అదనపు కలెక్టర్ ఈఓను ఆదేశించారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ జాతరలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తామని చెప్పారు. నాలుగు చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పా టు చేశామన్నారు. డీపీఓ స్వరూప మాట్లాడుతూ 120 మంది గ్రామ పంచాయతీ సిబ్బందితో జాతరలో పారిశుద్ధ్య పనులు చేయిస్తామని, జాతరలో ని రంతరం విద్యుత్ సరఫరాకు 260 కేవీ జనరేటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్, మహేందర్‌రెడ్డి, సంధ్యారాణి, రాంబాబు, రామలింగాచారి, మోహన్‌బాబు పాల్గొన్నారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పించాలి
సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్
Comments
Please login to add a commentAdd a comment