హామీలను అమలు చేయాలి
● సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు
జనగామ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. శనివారం పట్టణంలోని గబ్బెట్ట గోపాల్‌రెడ్డి భవన్‌లో కావటి యాదగిరి అధ్యక్షతన జరిగిన జిల్లా సమితి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీల విషయం ఒక్క అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న రీతిలో అమలవుతున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ హామీల అమలు ఇలానే కొనసాగిస్తే పోరాటాలకు సిద్ధం కావాల్సి వస్తుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ సత్తా చాటాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు ఆది సాయన్న, ఆకుల శ్రీనివాస్, నాయకులు చొప్పరి సోమయ్య, రావుల సదానందం, చామకుర యాకూబ్, జువారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
హామీలను అమలు చేయాలి
Comments
Please login to add a commentAdd a comment