ఈనెల 28 నుంచి షురూ..
● ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
● రూ.లక్ష బడ్జెట్ విడుదల●
● జిల్లాలో 196 మంది ఉపాధ్యాయులు
జనగామ: విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దేందుకు ఇటీవల కొత్తగా విధుల్లో చేరిన టీచర్లకు శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. ఇందుకు సంబంధించి టీఏ, డీఏల కోసం జిల్లాకు రూ.1,37,950 నిధులు కేటాయించింది. ఈ నెల 28వ తేదీ నుంచి మూడు కేటగిరీల్లో 196 మంది టీచర్లకు శిక్షణ అందించేందుకు విధి విధానాలను విద్యాశాఖ అధికారులకు పంపించగా, 8 మంది డీఆర్‌పీ (ట్రైనర్లు)లకు హైదరాబాద్‌లో శిక్షణ అందించారు. ఈ నెల 28, మార్చి 1, 3 తేదీల్లో 115 మంది ఎస్జీటీలు (జనగామ జిల్లా కేంద్రంలో), 3, 4, 5 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ, ఫిజికల్ సైన్స్ (హైదరాబాద్‌లో) 6, 7, 8 తేదీల్లో ఎస్‌ఏ హిందీ, తెలుగు గణితం, బయోలజీ, సోషల్, పీఈటీ, స్పెషల్ ఎడ్యుకేషన్ మొత్తంగా 81 మందికి తరగతి గదిలో విద్యార్థులకు ఎలా బోధించాలనే దానిపై ఒక్కో బ్యాచ్‌కు 40 నుంచి 45 మంది చొప్పున విభజించి అవగాహన కల్పించనున్నారు. శిక్షణ జరిగే సమయంలో ఉపాధ్యాయులకు ఎలాంటి సెలవులు ఇవ్వరాదని రాష్ట్ర విద్యాశాఖ డీఈఓలను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment