విద్యార్థులను ఆకర్షించేలా..
పాఠ్య పుస్తకాలను సంపూర్ణంగా ఎలా ఉపయోగించుకో వాలనే దానిపై కొత్త టీచర్లకు సవివరంగా అవగాహన కల్పించనున్నారు. విద్యార్థులను ఆకర్షించే విధంగా తరగతి గదిని ఎలా తీర్చిదిద్దాలి, విద్యా సామర్థ్యాలు, అభ్యసనా ఫలితాలకు సంబంధించి పిల్లలను ఎలా డెవలప్ చేయాలనే దానిపై డీఆర్‌పీలు బోధనా రూపంలో శిక్షణ ఇస్తారు. బోధన, వార్షిక ప్రణాళిక తయారీ, ఎఫ్‌ఏ–1, ఎస్‌ఏ పరీక్షల నిర్వహణ, పాఠ్య పుస్తకాల్లోని పాఠాలు బోధించే క్రమంలో యాక్టివిటీస్‌ను రూపొందించుకునే విధానం తదితర అంశాలను నేర్పించనున్నారు. అలాగే ఆన్‌లైన్‌లో ఉ న్న అంశాలను ఉపయోగించుకుని విద్యార్థులకు బోధించే మెటీరియల్‌ను ఎలా తయారు చేసుకోవాలనే దానిపై ప్రత్యక్షంగా చేసి చూపిస్తారు. ఎఫ్‌ఎల్‌ఎన్, లిప్‌తో పాటు పాఠశాల వి ద్యాశాఖ యాప్ విధి విధానాలు, యూడైస్‌ల ను పవర్ ప్రజెంటేషన ద్వారా చూపిస్తారు. టీఎల్‌ఎం తయారీ, మూల్యాంకణ పద్ధతులు, విద్యాశాఖ నిర్వహించే తదితర కార్యక్రమాలపై శిక్షణలో సవివరంగా వివరిస్తారు.
●
విద్యార్థులను ఆకర్షించేలా..
విద్యార్థులను ఆకర్షించేలా..
Comments
Please login to add a commentAdd a comment