జనగామ: కాముని పున్నమిని పురస్కరించుకుని గురువారం పలు కూడళ్లలో కామదహనం నిర్వహించారు. అర్ధరాత్రి వరకు కాముని మంటల చుట్టూ ఆడిపాడుతూ అల్లరిచేశారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధితోపాటు పట్టణంలోని కుర్మవాడ, బాలాజీనగర్, చమన్, గుండ్లగడ్డ, గోకుల్‌నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలు కాముని దహనం నిర్వహించారు. శుక్రవారం హోలీ పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు గురువారం హోలీకి సంబంధిత సామగ్రి విక్రయాలతో వీధులు, చౌరస్తాల్లో సందడి నెలకొంది. రంగులు, చిన్నారుల వాటర్ గన్స్ కొనుగోళ్లతో రోడ్లు, కూడళ్లు రద్దీగా కనిపించాయి.
పండగకు ఏర్పాట్లు
రంగుల పండగను ఘనంగా జరుపుకునేందుకు పిల్లలు, పెద్దలు సిద్ధమవుతున్నారు. హోలీకి ముందు రోజు కాముడి దహనం.. హోలీ రోజున ఆత్మీ యంగా రంగులు చల్లుకోవడంతో చిన్నాపెద్ద ఆనందంగా గడుపుతారు. సహజ సిద్ధంగా చల్లుకునే రంగులతో ఎలాంటి ఇబ్బంది ఉండదని, రసాయనిక రంగులతో చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. నేడు పలుచోట్ల ఉట్టి కొట్టే ఏర్పాట్లు సైతం చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో మహిళలు హోలీ రోజున ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటలతో దేవుడికి నైవేధ్యం సమర్పిస్తారు.
వాటర్ గన్స్, రంగుల కొనుగోళ్లు
సందడిగా మారిన మార్కెట్
ఘనంగా కాముడి దహనం
రంగుల హోలీకి స్వాగతం
రంగుల హోలీకి స్వాగతం