● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్
స్టేషన్‌ఘన్‌పూర్: సీఎం రేవంత్‌రెడ్డి సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకో వాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. శనివారం ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. పరిసరాలు, పోలీసు సిబ్బంది గృహ సముదాయం, అలాగే స్టేషన్‌లోని రికార్డులు, సీసీ కెమెరాలను పరిశీలించారు. శాంతిభద్రతల పరిస్థితి, ఫిర్యాదుల వివరా లను సీఐ వేణును అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివునిపల్లిలో ఆదివా రం జరిగే సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లు, బందోబస్తుపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సభాస్థలి, హెలిప్యాడ్ వద్ద పోలీసు బందోబస్తు, వాహనా ల పార్కింగ్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీలు భీమ్‌శర్మ, నర్సయ్య, సీఐ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.