● ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తి టౌన్ : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు చెందిన 76 మంది లబ్ధిదారులకు రూ.26.80 లక్షల విలువ చేసే సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారన్నారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ మంజుల, రాపాక సత్యనారాయణ, కుమారస్వామి, సురేష్‌నాయక్, ఎండీ మదార్, యాకాంతరావు తదితరులు పాల్గొన్నారు.