పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో సోమవారం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈఓ సల్వా ది మోహన్‌బాబు ఏర్పాట్లును పర్యవేక్షించారు.
ఇంటర్ పరీక్ష కేంద్రం తనిఖీ
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని ధర్మకంటలోని కోఎడ్యుకేషన్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, సీసీ కెమెరాల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి వసతి, మెడికల్ సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట డీఐఈఓ జితేందర్‌రెడ్డి, అధికారులు ఉన్నారు. కాగా సోమవారం జరిగిన పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 4,678 మంది విద్యార్థులకు గాను 4,440 మంది హాజరు కాగా 238 మంది గైర్హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి జితేందర్‌రెడ్డి తెలిపారు.
‘దేశాభివృద్ధికి
జమిలి ఎన్నికలే మేలు’
జనగామ రూరల్: దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే జమిలి ఎన్నికల నిర్వహణతోనే సాధ్యం అవుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా ప్రోగ్రాం కన్వీనర్ ప్రజ్జురి లక్ష్మీనర్సయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యం పటిష్టంగా క్షేత్రస్థాయి నుంచి బలపడాలంటే జమిలి ఎన్నికలే శరణ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేవీఎల్‌ఎన్ రెడ్డి, శోభనబోయిన శివరాజ్ యాదవ్, దుబ్బ రాజశేఖర్, కొంతం శ్రీనివాస్, పూసాల శ్రీమాన్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
సోమేశ్వరాలయంలో భక్తుల సందడి
సోమేశ్వరాలయంలో భక్తుల సందడి