జనగామ: నిలువ నీడలేక.. వారం రోజులుగా జిల్లా కేంద్రంలో సంచార జీవనం సాగిస్తున్న ఓ వృద్ధుడు ఎండ వేడికి తట్టుకో లేక గురువారం మున్సిపల్ కార్యాలయం సమీపంలో సొమ్మసిల్లి పడిపోయాడు. గమనించిన సాంబరాజు లక్ష్మి అనే మహిళ వీడియో తీసి అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్‌కు పంపించారు.. ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి చేరవేయగా.. కలెక్టర్ రిజ్వాన్ బాషా దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించారు. శక్తి టీంతో పాటు అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేయడంతో అమ్మ ఫౌండేషన్ ప్రతినిధులు మద్దెల కార్తీక్, ఎండీ.అఫ్రోజ్ వృద్ధుడు ఉన్న ప్రాంతానికి చేరుకుని ప్రాథమిక చికిత్స చేసి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, ఎఫ్‌ఆర్‌ఓ రాజు ఆధ్వర్యాన జనగామ మండలం శామీర్‌పేట శివారులోని కోమటిరెడ్డి సుశీలమ్మ–రుద్రమదేవి అనాథ వృద్ధాశ్రమంలో చేర్పించి ఆశ్ర మ బాధ్యులు తల్క లక్ష్మణ్, సుంకర దేవేందర్‌కు అప్పగించా రు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మణికుమార్, ముఖ్య సలహాదారు వంగ భీమ్‌రాజు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వృద్ధుడి విషయమై స్పందించిన సాక్షి, కలెక్టర్‌తో పాటు మానవతా దృక్పథంతో వ్యవహరించిన సాంబరాజు లక్ష్మి సేవలను కొనియాడారు.
‘సాక్షి’, అమ్మఫౌండేషన్ సమాచారంతో
స్పందించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా
సొమ్మసిల్లిన వృద్ధుడికి చేయూత