● అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్
జనగామ రూరల్: క్షయ వ్యాధి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, దీనిని అంద రూ బాధ్యతగా తీసుకుని సహకరించాలని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సోమవా రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన పట్టణంలో ని అంబేడ్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టిన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. క్షయ అనేది టీబీ రోగి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే జబ్బు అని, దీనిపై సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డీఎంహెచ్ ఓ మల్లికార్జున్‌రావు మాట్లాడుతూ.. వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే నివారణతో పాటు నియంత్రణ సులభతరం అవుతుందని చెప్పారు. రెండు గంట ల్లోనే టీబీని గుర్తించే పరికరాలు జిల్లా ఆస్పత్రిలో ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం నిమిత్తం నెలకు రూ.1,000 చొప్పున చికిత్స పూర్తయ్యే వరకు, మందులు ఉచితంగా ప్రభుత్వం ఇస్తోందని చెప్పారు. గత ఏడాది 1,051 మంది టీబీ బాధితులను గుర్తించగా 525 మందికి నగదు అందజేశామ ని, మిగతా వారికి త్వరలోనే ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం క్షయ నివారణకు ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలతో పాటు జ్ఞాపికలు అందజేశారు.