జనగామ: ‘రోడ్లు శుభ్రం చేయడం లేదు.. డ్రెయినేజీలు చెత్తతో నిండిపోయాయి.. వీధిలైట్లు వెలగడం లేదు.. మిషన్ భగీరథ పైపులైన్ కోసం నాలుగేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదు.. కోతులు, కుక్కల బెడదతో ఇబ్బంది పడుతున్నం’.. ఇలా అనేక సమస్యలను జనగామ పట్టణ ప్రజలు ఏకరువు పెట్టారు. ‘సాక్షి’ ఆధ్వర్యాన బుధవారం నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు గంటన్నర పాటు 70 మందికి జవాబివ్వగా.. మరో 153 మిస్డ్‌కాల్స్ ఉన్నాయి.
సమస్యలు ఇలా..
సమస్య: బాలాజీనగర్ న్యూ వెంచర్ నిర్మాణంలో డ్రెయినేజీ లేదు. కనీస సదుపాయాలు లేవు.
– యాదగిరి, దివ్యాంగుడు, బాలాజీనగర్
కమిషనర్ : నిధుల రాబడి ఆధారంగా అభివృద్ధి పనులు చేపడుతునాం.
సమస్య: రుద్రమదేవి ఆఫీస్ పక్కన బావిలో చెత్త డంపు చేస్తున్నారు. సెయింట్ పాల్స్ స్కూల్ నుంచి తెచ్చిన చెత్త ఇక్కడే వేస్తున్నారు.
– పన్నీరు రవీందర్, మోహిన్‌బాయ్, రిటైర్డ్ టీచర్, అన్నెబోయిన సత్యం, బీరప్పగడ్డ
కమిషనర్ : సమస్య పరిష్కరిస్తాం.
సమస్య: చలి వేంద్రాలు, మూగ జీవాల దాహార్తి తీర్చేందుకు కుళాయిలు పెట్టాలి. ఫ్లైఓవర్‌పై పూల కుండీలను తొలగించాలి.
– మంతెన మణి, వంగ భీమ్‌రాజ్ అమ్మ ఫౌండేషన్
కమిషనర్ : ఆలోచిస్తాం.
సమస్య: వీధిలైట్లు లేక రాత్రి కాలనీలోకి వెళ్లాలంటే భయమేస్తోంది. మహిళలు ఇబ్బంది పడుతున్నారు.
– సాంబారి నాగార్జున, బాలాజీనగర్
కమిషనర్ : త్వరలోనే వేయిస్తాం.
సమస్య: సిద్ధిపేటరోడ్డుపై పండ్ల వ్యాపారాలతో వాహన పార్కింగ్ లేకుండా చేస్తున్నారు. ట్యాక్స్ చెల్లిస్తూ.. షాపులు రెంట్‌కు ఇస్తే వాహనాలు నిలిపే పరిస్థితి లేదు. పోలీసులు నో పార్కింగ్‌తో చలాన్ వేస్తున్నారు. పండ్ల వ్యాపారం తొలగించాలి.
– అల్లాడి ప్రభాకర్, నెహ్రూపార్కు
కమిషనర్ : ఫుట్‌పాత్ వ్యాపారాన్ని
తొలగిస్తాం.
సమస్య: గల్లీలో 25 ఫీట్ల రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. రాకపోలకు ఇబ్బందులు తప్పడం లేదు.
– వాణి, బాలాజీనగర్, ఎల్లమ్మటెంపుల్
కమిషనర్ : విచారణ చేపడతాం.
సమస్య: సీసీరోడ్డు లేదు. కనీసం డ్రెయినేజీ పనుల న్నా చేపట్టి మురికి బాధ తొలగించాలి.
– ఎం.కనకలక్ష్మి, బీరప్పగడ్డ
కమిషనర్ : డ్రెయినేజీ నిర్మాణానికి పరిశీలిస్తాం.
సమస్య: మంగళ, ఆదివారం రోజుల్లో ఎల్లమ్మ టెంపుల్ వద్ద జాతర జరుగుతుంది. వాహనదారులు ప్రధాన రహదారిపై పార్కింగ్ చేస్తున్నారు. స్కూల్ బస్సు కాలనీకి వచ్చే పరిస్థితి లేదు. విస్తరాకులు రోడ్డుపైనే వేస్తున్నారు.
– సుల్తాన్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్, వేణుగోపాల్‌రెడ్డి, రేణుకానగర్ ఎల్లమ్మగుడి, యశ్వంతాపూర్
కమిషనర్ : వచ్చి పరిశీలిస్తాం. పార్కింగ్ సమస్య పోలీసులకు చెప్పండి
సమస్య: నెహ్రూపార్కు జంక్షన్ వద్ద రౌండ్ సర్కిల్ నిర్మించాలి. స్కూళ్లు, కాలేజీలు ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందిగా ఉంది. డివైడర్, జంక్షన్, సెంట్ర ల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి.
– ఎండీ.రియాజ్, 25వ వార్డు
కమిషనర్ : పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్తాం.
సమస్య: ట్యాక్స్‌లు చెల్లిస్తున్నాం. అయినా పారిశుద్ధ్య పనుల నిర్వహణ సక్రమంగా లేదు. చెత్త కుండీలు ఏర్పాటు చేయలేదు.
– కె.వెంకటేశ్వర్‌రావు, గ్రేయిన్ మార్కెట్ ఏరియా
కమిషనర్:ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం.
సమస్య: వడ్లకొండ బైపాస్‌లోని కాలనీ పట్టణంలో విలీనమై ఎనిమిదేళ్లు గడిచింది. మిషన్ భగీరథ వాటర్ పైపులైన్‌కు దరఖాస్తు చేసి నాలుగేళ్లు అవుతోంది. ప్రస్తుతం బోర్లు వట్టిపోయి వాటర్ సమస్య ఉంది.
– అశోక్‌కుమార్, వడ్లకొండ బైపాస్‌రోడ్డు,
8వ వార్డు
కమిషనర్ : పైపులైన్ ఏర్పాటు, వాటర్ సమస్య పరిష్కరిస్తాం.
సమస్య: మాది కొత్తగా ఏర్పడిన కాలనీ. సీసీరోడ్లు, డ్రెయినేజీ నిర్మించలేదు. కనీసం వీధి దీపాలు ఏర్పాటు చేయడం లేదు.
– రవిప్రసాద్, వికాస్‌నగర్‌కాలనీ.
కమిషనర్ : కాలనీకి వచ్చి పరిశీలిస్తాం.
సమస్య: నైన్‌డైన్ హోటల్ సమీపంలో డ్రెయినేజీ ఒక్కరోజు క్లీన్ చేస్తే.. వారం వరకు రావడంలేదు. ఈ దారిలో గుంతలు ఏర్పాడ్డాయి.
– కాసుల శ్రీనివాస్, శ్రీనగర్‌కాలనీ
కమిషనర్ : ఇబ్బంది లేకుండా చేస్తాం.
సమస్య: మోడల్ మార్కెట్ పనులు సత్వరమే పూర్తి చేయాలి. దేవీ థియేటర్ నుంచి యశ్వంతాపూర్ వరకు నిర్మిస్తున్న అండర్ డ్రెయినేజీ పనులు మధ్యలో ఆపేశారు.
– ఎండీ.రఫీక్, 26వ వార్డు, గణేష్ స్ట్రీట్
కమిషనర్ : ప్రభుత్వం నుంచి నిధులు రాగానే మోడల్ మార్కెట్ పనులు పూర్తి చేస్తాం.
సమస్య: కాలనీరోడ్లపై పరుపులు, చెత్త వేసి తగుల బెడుతున్నారు. పెద్దమోరీ వెనుక లైన్‌లో డ్రెయినేజీ నీరు ప్లాట్లలో నిలుస్తున్నది.
– శ్రీహరి, భాస్కర్, కాకతీయకాలనీ, 17వ వార్డు, దండ్యాల వరలక్ష్మి, వెంకన్నకుంట
కమిషనర్ : చర్యలు తీసుకుంటాం
సమస్య: వార్డులో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన గోడ తొలగించి రాకపోలకు ఇబ్బంది లేకుండా చూడాలి. – కృష్ణ, వెంకన్నకుంట
కమిషనర్ : విచారణ చేపడతాం.
సమస్య: కుక్కలకు రేబిస్ వ్యాధి వచ్చినట్టు ఉంది. శరీరమంతా గాయాలు, రక్తంతో వార్డులో తిరుగుతున్నాయి. భయంగా ఉంది.
– ఉదయ్‌కిరణ్, 9వ వార్డు
కమిషనర్ : సమస్య పరిష్కరిస్తాం.
సమస్య: సిద్దిపేట ప్రధాన రహదారి సూపర్ మార్కెట్ వద్ద తెల్లవారుజామున చెత్త డంపు చేస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది.
– అబ్బాస్, 21వ వార్డు
కమిషనర్ : చెత్త వేయకుండా చర్య తీసుకుంటాం.
సమస్య: కోనోకార్పస్ మొక్కలను తొలగించాలి. కలెక్టరేట్ వద్ద నిరసన, ధర్నాల సమయంలో మజ్జిక ప్యాకెట్లు, పూలదండలు అక్కడే పడేస్తున్నరు. – శ్రీనివాసరావు, దుర్గాకాలనీనగర్
కమిషనర్ : పైఅధికారులకు చెబుతాం.
సమస్య: మూడు రోజుల క్రితం హైదరాబాద్‌కు బయలుదేరే సమయంలో కోతుల గుంపు వెంబ డించింది. తప్పించుకున్నాను. బయటకుళ్లి పని చేయలేని పరిస్థితి. కోతుల నుంచి కాపాడండి.
– గణేష్‌బాబు అంబేడ్కర్‌నగర్, కందుకూరి శ్రీనివాస్ లక్ష్మీబాయ్‌కుంట, రేవతి, మేకల సమ్మయ్య అంబేడ్కర్‌నగర్, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ధర్మకంచ ఏరియా
కమిషనర్ : కోతుల గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇస్తాం.
కంపుకొడుతున్న కాలనీలు..
కోతులు, కుక్కల స్వైర విహారం
వెలగని వీధిదీపాలు..
సీసీరోడ్లకు నోచుకోని కాలనీలు
‘సాక్షి’ ఫోన్ ఇన్‌లో సమస్యలు ఏకరువు పెట్టిన పట్టణ ప్రజలు 70 కాల్స్‌కు సమాధానం ఇచ్చిన కమిషనర్ వెంకటేశ్వర్లు
సమస్య: రోడ్లపై చెత్త, మురికి కాల్వలు నెలల తరబడి తీయడం లేదు. వీధి లైట్లు ఆర్నెళ్ల నుంచి వెలగ డం లేదు. మసీదు ఎదురుగా 15 రోజులకోసారి కూడా డ్రెయినేజీ క్లీన్ చేయడం లేదు. కోతులు, కుక్కల బెడద అధికంగా ఉంది. సీసీరోడ్ల నిర్మాణం అడ్డదిడ్డంగా చేపట్టడంతో ఇళ్ల ఎదుట నీరు ఆగుతోంది. రైల్వే అండర్ పాస్ కింద మురికి నీరు నిలుస్తున్నది.
– సముద్రాల సందీప్ బాణాపురం, సీవీఎల్‌ఎన్.రెడ్డి బాలాజీనగర్, మారోజు నాగరాజు, జబ్బార్ అంబేడ్కర్‌నగర్, జమాల్ షరీఫ్, అడ్వకేట్ శోభారాణి, బాలాజీనగర్ ఎల్లమ్మగుడి, శ్రవన్‌బాబు దేవి థియేటర్ వెనకాల, ఎంఏ.అలీ, రిటైర్డ్ హెచ్‌ఎం కాకతీయకాలనీ, అజ్మీరా వంశీ, అనిల్ దుర్గానగర్‌కాలనీ, బొల్లం ఉదయ్‌కుమార్, బిర్రు రామలింగం, వీవర్స్‌కాలనీ, బండోజు ఆంజ నేయులు బాలాజీనగర్.
కమిషనర్ : శానిటేసన్ నిర్వహణ బాగుపడేలా చర్యలు చేపడతాం.
మోరీ తీయరు.. చెత్త ఎత్తరు