పాలకుర్తిటౌన్: తెలంగాణ సాయుధ పోరాట యో ధురాలు చాకలి ఐలమ్మ డాక్యుమెంటరీని బుధవా రం స్థానిక ఐలమ్మ విగ్రహం వద్ద చిత్రీకరించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. వచ్చే నెల 2న హైదరాబాద్ ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఆవరణంలో ఐలమ్మ కాంస్య విగ్రహం ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఐలమ్మ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చేలా ప్రభుత్వం ఆలోచించాలని, ట్యాంక్ బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేయడంతోపాటు జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని అన్నారు. కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత డాక్టర్ రవి కాంత్, దర్శకురాలు డాక్టర్ సంధ్య, ఐలమ్మ కుటుంబ సభ్యులు చిట్యాల సంపత్, శ్వేత, యాకయ్య, మంజుల, సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ, మార్గం లక్ష్మీనారాయణ, గుమ్మడిరాజు సాంబయ్య, పుస్కూరి శ్రీనివాస్ రావు, మాచర్ల సారయ్య పాల్గొన్నారు.