నిండా ముంచిన ‘బాండ్ మక్క’
కన్నాయిగూడెం: మండల పరిధి పలు గ్రామాల్లో బాండ్ మక్కా పేరు చెప్పి పంటసాగు చేయించిన ఓ కంపెనీ ప్రతినిధులు నాసిరకం విత్తనాలు ఇచ్చి రైతులను నిండా ముంచారు. ఈ ఘటన మండలంలో ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితుల రైతుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని లక్ష్మీపురం, గుర్రేవుల, బుట్టాయిగూడెం, చింతగూడెం, కంతనపల్లి గ్రామాల్లో సిజెంటా, హైటెక్ కంపెనీలకు చెందిన బాండ్ మక్కాను ఆయా కంపెనీల ప్రతినిధులు రైతులకు అందించి 80ఎకరాల్లో సాగు చేయించారు. సాగు సమయంలో ఫిక్స్‌డ్ రేటుతో పాటు మంచి దిగుబడి వస్తుందని నమ్మించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట ఏపుగా పెరిగింది కానీ కంకులకు గింజలు పోయకుండా బెండు మాత్రమే ఉందంటూ రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలో కంపెనీ ప్రతినిధులను రైతులు నిలదీయగా.. కంపెనీ నుంచి పరిహారం ఇప్పిస్తామని చెప్పి సంచుల్లో వాటిని నింపి పెట్టండి తీసుకెళ్తామని నమ్మబలికి ఇక్కడి నుంచి వెళ్లిపోయి తిరిగి రావడం లేదని వాపోయారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఆయా కంపెనీల ప్రతినిధులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
పంటచేతికొచ్చినా గింజలు నిల్
నాసిరకం విత్తనాలతో రైతులకు నష్టం
Comments
Please login to add a commentAdd a comment