పరీక్షకు వెళ్తుండగా విద్యార్థికి గాయాలు
రేగొండ: గురుకుల ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళ్తున్న క్రమంలో ఓ విద్యార్థి కాలు విరిగింది. మహాముత్తారం మండలం రెడ్డిపల్లికి చెందిన రాజేశ్ గురుకులాల ప్రవేశ పరీక్ష రాసేందుకు మండలంలోని లింగాల మహాత్మాజ్యోతిబా పూలే పాఠశాలకు వెళ్లాడు. పరీక్ష సమయానికంటే అరగంట ముందే కేంద్రానికి చేరుకోగా.. అధికారులు విద్యార్థులను లోపలికి పంపించే క్రమంలో విద్యార్థి హాల్‌టికెట్ పరిశీలించారు. చిట్యాల మండలంలోని సోషల్ వెల్ఫేర్ సెంటర్ అని ఉండడంతో.. తొందరగా వెళ్లాలనే క్రమంలో చిట్యాల వెళ్తుండగా.. లింగాల వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయింది. దీంతో విద్యార్థి కాలు విరిగింది. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రుడిని మెరుగైన చికిత్స కోసం భూపాలపల్లిలోని వంద పడకల ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment