మూడు గంటలుగా బస్సు లేదు..
మంచిర్యాల నుంచి దర్శనానికి వచ్చాను. మూడు గంటల నుంచి ఆర్టీసీ బస్సులు లేవు. వచ్చిన ఒకటి, రెండు బస్సుల్లో కిక్కిరిసి పోతున్నారు. ఆర్టీసీ అఽధికారులు బస్సుల సంఖ్య పెంచాలి. ఓ పాప బస్సు టైరు కింద పడిపోయేది. అక్కడున్న వారు కాపాడారు. బస్సుల కోసం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎదురుచూపు తప్పలేదు.
– లక్ష్మీ, ప్రయాణికురాలు
ఒక్కసారిగా రద్దీ పెరిగింది..
కాళేశ్వరాలయానికి ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. మధ్యాహ్నం నుంచి విషయం తెలియగానే నాలుగు బస్సులు ఏర్పాటు చేశాం. రాత్రి 7.30గంటల తరువాత రద్దీ తగ్గింది.
– ఇందు, ఆర్టీసీ డీఎం, భూపాలపల్లి
Comments
Please login to add a commentAdd a comment