మూడు రోజులపాటు వైభవోపేతంగా..
కాళేశ్వరం: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు గురువారం పూర్ణాహుతితో ముగిశాయి. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవోపేతంగా ఉత్సవాలను దేవస్థానం అధికారులు నిర్వహించారు. గురువారం ఉదయం 8గంటలకు గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేకంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12గంటలకు వేదపండితులు ప్రత్యేక పూజలతో యాగశాలలో పూర్ణాహుతి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి నాకబలి, నందివాహన పవళింపు సేవతో కార్యక్రమాలు ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తిశర్మ దంపతులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
శ్రీఆదిముక్తీశ్వర–శుభానందల కల్యాణం..
మహదేవపూర్ మండలం కాళేశ్వరం అనుబంధ దేవాలయమైన అడవిలో వెలసిన శ్రీఆదిముక్తీశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి మరుసటి రోజున ఆనావాయితీ ప్రకారం శ్రీఆదిముక్తీశ్వర–శుభానంద కల్యాణం శాస్త్రోక్తంగా వేదపండితులు మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా నిర్వహించారు. గురువారం సాయంత్రం ఆలయ వేదపండితుల ఆధ్వర్యంలో కల్యాణ తంతును నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ మహేష్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్‌లు కామిడి రాంరెడ్డి, మెంగాని మాధవి, మాజీ దేవస్థానం డైరెక్టర్లు అశోక్, శ్యాంసుందర్ దేవుడా భక్తులు పాల్గొన్నారు.
దేవస్థానం ఆదాయం రూ.21లక్షలు
మూడు రోజులకు గాను కాళేశ్వరం దేవస్థానానికి వివిధ పూజలు, లడ్డు ప్రసాదాలు, తైబజార్ విక్రయాల ద్వారా రూ.21లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ శనిగెల మహేష్ తెలిపారు. గత సంవత్సరం శివరాత్రి ఆదాయం రూ. 13.98లక్షల వరకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. గతం కంటే ఈసారి అధికంగా లక్షన్నర మంది వరకు భక్తులు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి తరలివచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ఆదాయం పెరిగినట్లు చెప్పారు.
పూర్ణాహుతితో ముగిసిన
శివరాత్రి ఉత్సవాలు
దేవస్థానానికి రూ.21లక్షల ఆదాయం
ఘనంగా ఆదిముక్తీశ్వర–శుభానందల కల్యాణం
తరలివచ్చిన భక్తులు
మూడు రోజులపాటు వైభవోపేతంగా..
Comments
Please login to add a commentAdd a comment