నా భర్త హత్యపై దర్యాప్తు జరిపించాలి
భూపాలపల్లి: ఈ నెల 19న దారుణ హత్యకు గురైన భూపాలపల్లి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి భార్య సరళ గురువారం సంచలన ఆరోపణలు చేస్తూ మీడియాకు ఒక వీడియోను విడుదల చేసింది. భూపాలపల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట గల రెండు గుంటల భూ వివాదం కారణంగా తన భర్త హత్యకు గురి కాలేదని, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కోర్టులో కేసు వేసినందుకే హత్యకు గురయ్యాడని పేర్కొంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మున్సిపాలిటీ మాజీ వైస్‌చైర్మన్ కొత్త హరిబాబు కుట్ర పన్ని హత్య చేయించారని ఆరోపించారు. తన భర్త హత్య కేసును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించాలని ఆమె సీఎం రేవంత్‌రెడ్డిని వేడుకున్నారు. తనకు కూడా ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు ఇప్పటికై నా హరిబాబును పట్టుకుంటే తన భర్త ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. ఈ హత్యపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కొత్త హరిబాబులపై అనుమానం వ్యక్తం చేస్తూ, ఫిర్యాదు చేస్తానని తెలపగా, వాళ్ల పేర్లు ఎందుకంటూ స్థానిక డీఎస్పీ సంపత్‌రావు.. తనను తప్పుదోవ పట్టించి ఫిర్యాదు రాయించుకున్నారని సరళ విడుదల చేసిన వీడియోలో ఆరోపించింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై
కోర్టుకు వెళ్లినందుకే..
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
హత్యకు కుట్ర పన్నారు
నాగవెల్లి రాజలింగమూర్తి భార్య
సరళ ఆరోపణ
Comments
Please login to add a commentAdd a comment