తనిఖీలు ముమ్మరం..
కాంటా వద్ద మైనింగ్ ఆర్‌ఐలు పర్యవేక్షించి తూకంలో నిబంధన ప్రకారం ఎక్కువగా వస్తే వెంటనే తీసేస్తున్నారు. ఎలాంటి అదనపు ఫీజు వసూలు కాకుండా చూస్తున్నారు. తక్కువగా లోడింగ్ చేస్తే అక్కడే నింపుతున్నారు. రెవెన్యూ ఉద్యోగులు తూకంవేసిన లారీ నంబర్, వేబిల్లును పరిశీలిస్తున్నారు. పోలీసులు క్రమపద్ధతిలో లారీలను త్వరత్వరగా తరలిస్తున్నారు. కాంటా వద్ద ఒక ప్రొక్‌లైయిన్‌తో తీయడం, నింపడం చేస్తున్నారు.
లారీల్లో ఇదివరకు రెండు నుంచి మూడు టన్నుల ఇసుకను నింపి అదనంగా డబ్బులు తీసుకునేవారు. కానీ ఇప్పుడు లారీల్లో తమ లారీల రిజిస్ట్రేషన్ కార్డుపై ఎంత బరువు ఉంటే అంతే కలుపుకొని కేజీ ఇసుకను కూడా ఎక్కువగా నింపడం లేదని లారీడ్రైవర్లు, యజమానులు చెబుతున్నారు. లారీ కొనుగోలు తరువాత ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్ ఇతర పరికరాలతో బాడీమార్చారు. ప్రస్తుతం ఉన్న లారీబరువుల ప్రకారం లారీలో ఇసుకను నింపాలని డ్రైవర్లు కోరుతున్నారు. ఇలా నింపకపోతే టన్ను, టన్నున్నర వరకు తక్కువగా వస్తుందని వాపోతున్నారు. దీంతో ధరలు పెంచుతున్నారు. ఇలా నిబంధనలు అతిక్రమిస్తే కేసు నమోదు కూడా అవుతున్నట్లు తెలుపుతున్నారు. ఈ విషయమై ప్రాజెక్టు అధికారి రంగారెడ్డిని ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment