యాజమాన్యమే పనులు చేపట్టాలి
భూపాలపల్లి అర్బన్: కాంట్రాక్టర్లకు అప్పగించే విధానాన్ని విరమించుకొని సింగరేణి యాజమాన్యమే బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. ఏరియాలోని కేటీకే 8వ గని రెండో సీమ్‌ను ప్రైవేట్‌పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఏరియాలోని జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. కేటీకే 8వ గని ప్రైవేట్‌పరం చేయడం వల్ల సింగరేణికే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందన్నారు. ిసింగరేణి ఆధ్వర్యంలోనే బొగ్గు వెలికితీయాలని కోరారు. ఎన్నో సంవత్సరాల నుంచి సింగరేణి సంస్థ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని, ప్రైవేట్‌పరం చేయడం వల్ల డిపెండెంట్ ఉద్యోగాలు రాక కార్మిక పిల్లలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. సింగరేణిలో నూతన గనులు ఏర్పాటుకు యాజమాన్యం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎస్‌ఓటు జీఎం కవీంద్రకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాతంగి రామచందర్, సుధాకర్‌రెడ్డి, విజేందర్, శ్రీనివాస్, ఆసిఫ్‌పాష, రవికుమార్, రామచందర్, నూకల చంద్రమౌళి, ఫిట్ సెక్రటరీలు సదయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment