
ఉద్యోగికి ఘన సన్మానం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియా ఇంజనీర్ పి.రామకృష్ణారెడ్డి సోమవారం ఉద్యోగ విరమణ పొందగా ఏరియా అధికారులు ఘనంగా సన్మానించారు. జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డిని ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు వెంకటరామిరెడ్డి, వెంకటరమణ, భిక్షమయ్య, రవికుమార్, ప్రసాద్, మారుతి పాల్గొన్నారు.
8వ గనిలో..
ఏరియాలోని కేటీకే 8వ గనిలో విధులు నిర్వరిస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఆరెల్లి లాలయ్యను గని మేనేజర్ భానుప్రసాద్, గని అధికారులు, కార్మికులు ఘనంగా సన్మానించారు. బొగ్గు ఉత్పత్తికి లాలయ్య చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని కార్మికులు పని చేయాలని భానుప్రసాద్ సూచించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అధికారి సాయికృష్ణ, కార్మిక సంఘాల నాయకులు శంకర్, సమ్మయ్య, విజేందర్, రాజేష్ పాల్గొన్నారు.