
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
టేకుమట్ల: రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం మండలంలోని రాఘవరెడ్డిపేటలో జైబాపు, జై భీం, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, అంబేడ్కర్, రాజ్యాంగ చిత్రపటాలకు పూలమాలలు వేసి, మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను ప్రజలందరికీ తెలిసేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. బడుగు, బలహీన వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపర్చిన అంశాలను ప్రజలందరూ తెలుసుకోవాలన్నారు. సామాజికవర్గం కోసం కాదని, దేశ ప్రజలందరి కోసం రాజ్యాం రూపొందించినట్లు తెలిపారు. కానీ, నేడు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే కుట్ర పన్నుతుందన్నారు. రాజ్యాంగాన్ని విమర్శించే బీజేపీ నాయకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం మండలంలోని కుందనపల్లిలో బాబు జగ్జీవన్‌రావు జయంతి వేడుకల్లో పాల్గొని, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. మండలంలోని ఆరెపల్లి, కుందనపల్లి, గుమ్మడవెల్లి, దుబ్యాల, ఎంపేడు, వెంకట్రావుపల్లిలోని అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, మండల ఇన్‌చార్జ్ కామిడి శ్రీనివాస్‌రెడ్డి, నాయకుల శ్రీనివాస్, వీరన్న, కిరణ్, వీరేశం, రవీందర్, కుమారస్వామి, ప్రభాకర్, సంపత్, స్వామిరావు, మహిపాల్‌రెడ్డి, సాంబయ్య పాల్గొన్నారు.