
రణదివే ఆశయాలను కొనసాగించాలి
ములుగు రూరల్ : కార్మిక ఉద్యమనాయకుడు, సీఐటీయూ అఖిల భారత వ్యవస్థాపక అధ్యక్షుడు బీటీ రణదివే ఆశయాలను కొనసాగించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో రణదివే 35వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం 1970లో ఐక్యత, పోరాటం అనే నినాదంతో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్(సీఐటీయూ) ఏర్పడిందని అన్నారు. కులం, మతం, లింగ బేధం తేడాలతో విడిపోవడం వల్ల కార్మికులు నష్టపోతారని ఐక్యతగా ఉద్యమం నిర్మించాలని పిలుపునిచ్చారని అన్నారు. కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నీలాదేవి, సద్దాం హుస్సేన్, నారాయణ, ప్రవీణ్, రవీందర్, రాజు, రజిత, రమ, జ్యోత్న్స తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్