
ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ వేగవంతం
భూపాలపల్లి: జిల్లాలో తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ హౌసింగ్ అధికారులకు సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలోని మొదటి అంతస్తులో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికై న లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టి గడువులోపు పూర్తి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ లోకిలాల్, డీఈ శ్రీకాంత్, ఏఈ రాజలింగం తదితరులు పాల్గొన్నారు.
కంటి వైద్య శిబిరంతో ప్రతి ఒక్కరికీ మేలు
కాటారం: కంటి వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఉచిత కంటి వైద్య శిబిరంతో ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతిని పురస్కరించుకొని పుష్పగిరి కంటి ఆస్పతి ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శ్రీపాద ట్రస్టు చైర్మన్ శ్రీనుబాబుతో కలిసి కలెక్టర్ రాహుల్‌శర్మ ప్రారంభించారు. అంతకుముందు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కంటి పరీక్షలు చేయించుకునే ఆర్థిక స్థోమత లేని వారికి ఈ ఉచిత వైద్య శిబిరం ఉపయోగపడుతుందన్నారు. కంటి చూపు లోపం ఉన్న ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. శ్రీనుబాబు మాట్లాడుతూ పుష్పగిరి ఆస్పత్రి ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ అవసరమైన ప్రతి ఒక్కరికీ ఉచితంగా చేయించడంతో పాటు కంటి అద్దాలు అందించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మధుసూదన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, యూత్ అధ్యక్షుడు చీటూరి మహేశ్‌గౌడ్, మహిళా అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, మండల వైద్యాధికారిణి మౌనిక, నాయకులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ

ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ వేగవంతం

ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ వేగవంతం