
అంబేడ్కర్ జయంతి వేడుకలు
భూపాలపల్లి అర్బన్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134 జయంతి వేడుకలను జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని పంచశీల పతాకావిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ. అంబేడ్కర్ కారణంగానే అన్ని కులాల వారికి సమన్యాయం జరుగుతుందన్నారు. వచ్చే అంబేడ్కర్ జయంతి నాటికి అంబేడ్కర్, జ్యోతిరావుపూలే కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవి, అదనపు ఎస్పీ బోనాల కిషన్, డీఎస్పీ సంపత్‌రావు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునిత, దళిత సంఘాల నాయకులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మంగళవారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీకాంత్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 11కేవీ విద్యుత్ లైన్ మరమ్మతుల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని.. వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.

అంబేడ్కర్ జయంతి వేడుకలు