
మ్యాన్ రైడింగ్ పొడిగించాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని కేటీకే–5వ గనిలో మ్యాన్ రైడింగ్‌ను పొడిగించాలని కోరుతూ.. సీఐటీయూ నాయకులు మంగళవారం ఏరియా ఇన్‌చార్జ్ జీఎం వెంకటరామరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహరావు మాట్లాడుతూ.. భూగర్భ గనిలో సరిపడా మ్యాన్ రైడింగ్ లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. 21వ లెవల్ నుంచి 31వరకు కాలినడకన వెళ్తున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. అనేక సంవత్సరాలు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. పని ప్రదేశాల్లో మరుగుదొడ్లు నిర్మించాలని, మలినాలు తాగే నీటిలో కలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంపేటి రాజయ్య పాల్గొన్నారు.