
కాళేశ్వరం ఆర్చి నిర్మాణ పనుల ప్రారంభం
కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలో కాళేశ్వరం దేవస్థానానికి సంబంధించిన ఆర్చి నిర్మాణ పనులు ఎన్‌హెచ్ 353(సీ) ప్రధాన రహదారిపైన బుధవారం ప్రారంభమయ్యాయి. 2018లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భారీ యంత్రాలు, పరికరాలు, మోటార్లు ఆర్చి కింద నుంచి వెళ్లేందుకు వీలుగా లేకపోవడంతో మేఘా ఇన్‌ఫ్రా సంస్థ కూల్చివేసింది. ఆ సమయంలో సదరు నిర్మాణ సంస్థ రూ.25 లక్షలు దేవస్థానానికి పరిహారంగా చెల్లించింది. అప్పటి నుంచి ఆర్చి నిర్మాణంపై దేవాదా యశాఖ దృష్టిసారించలేదు. ఈక్రమంలో మే 15 వ తేదీ నుంచి 26 వరకు జరిగే సరస్వతీనది పుష్కరాల సందర్భంగా ఆర్చి పనులు త్వరగా పూర్తిచేయాలని మంత్రి శ్రీధర్‌బాబు, దేవదాయశాఖ ప్రి న్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించడంతో ఈఓ మహేష్ పనులు ప్రారంభించారు. పిల్లర్లకో సం జేసీబీతో తవ్వకాల చేపట్టారు. కాగా, రూ.32 లక్షల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు.
2018లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ
సమయంలో తొలగింపు

కాళేశ్వరం ఆర్చి నిర్మాణ పనుల ప్రారంభం