జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో గద్వాల, అయిజ పాత మున్సిపాలిటీలు కాగా, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు నూతనంగా ఏర్పడ్డాయి. జిల్లాలోనే పెద్ద పట్టణమైన గద్వాల, అయిజలలో అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. వడ్డేపల్లిలో సైతం ప్రజల నుంచి స్పందన లభించింది. ఖాళీ స్థలాలు ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవడంతో వీటి సంఖ్య పెరిగింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిఽధిలో 28,663 దరఖాస్తులు వచ్చాయి. ప్లాట్ల యజమానులు క్రమబద్దీకరణకు రూ.ఒక వేయి రిజిస్ట్రేషన్ ఫీజు ప్రభుత్వానికి చెల్లించగా. లేఅవుట్ స్థలానికి రూ.10వేలు చెల్లించారు. ఆరు నెలల కిందట మూడు దశలో అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించడానికి ఏర్పాట్లు చేశారు. వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా పరిశీలన చేసేందుకు రెవెన్యూ, జలవనరులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ బృందాల్లో సభ్యులుగా నియమించారు. మూడు శాఖల మధ్య సమన్వయ లోపం, సిబ్బంది కోరత కారణంగా ఇప్పటి వరకు దరఖాస్తులు పరిశీలనకు చోచుకోవడం లేదు. క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తికాకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment