స్టేషన్ మహబూబ్‌నగర్: పాలమూరు యూనివర్సిటీలో ఉర్దూ విభాగం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ మైనార్టీ ఎంప్లాయిస్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం వీసీ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఉర్దూ భాష సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు, స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు పీయూలో ఎంఏ ఉర్దూ కోర్సును ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉర్దూ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువ అని, పీయూలో ఉర్దూ విభాగం లేకపోవడంతో ఏటా వందలాది మంది విద్యార్థులు హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. స్థానిక ఎన్టీఆర్ డిగ్రీ మహిళా కళాశాల, ఎంవీఎస్ కళాశాలల్లో ప్రతి ఏడాది 400 మందికిపైగా ఉర్దూ గ్రాడ్యుయేట్లు ఉత్తీర్ణులవుతున్నారని, దీంతో ఎంఏ, పీహెచ్‌డీ అందుబాటులో లేకపోవడంతో చాలామంది పై చదువు చదవలేకపోతున్నారన్నారు. కార్యక్రమంలో సయ్యద్ అబ్దుల్ వహీద్‌షా, మహ్మద్ అబ్దుల్ రషీద్, మహ్మద్ అబ్దుల్ ఖలీల్, యూసుఫ్ బిన్ నాసర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment