తాగునీటి సమస్య తలెత్తనీయొద్దు
గద్వాల: రాబోయే వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు కలగకుండా జిల్లా వ్యాప్తంగా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్‌లో మండలాల వారీగా తాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో, మున్సిపల్ పరిదిలో నీటి సరఫరాను మెరుగుపరిచేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైన నీటి కొరత ఏర్పడినట్లయితే తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నిరంతరం నీరు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. జిల్లాలో నీటి సరఫరా ప్రభావితంగా కొనసాగేలా బల్క్ వాటర్ సప్లయ్ ఓహెచ్‌ఎస్‌ఆర్ సింగిల్ ఫేజ్ చేతి పంపులు, ప్రైవేట్ బోర్‌వెల్స్, ట్యాంకర్లు వంటి అన్ని మార్గాలను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలని ఆదేశించారు. అదనంగా వ్యవసాయ బోర్ వెల్స్‌ను కూడా బ్యాకప్ ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. పీడబ్ల్యూఎస్ మోటార్లు, పైపులైన్లు పూర్తిగా పరిశీలించి 15 రోజుల్లో అన్ని మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. తాగునీటి మొత్తం డిమాండ్, సరఫరా సమతుల్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సరఫరాపై ఎంపీడీఓలకు, పంచాయతీ కార్యదర్శులకు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, మిషన్ భగీరధ ఎస్ ఈ వెంటకరమణ, ఈఈ గ్రిడ్ పరమేశ్వరి, ఈఈ ఇంట్రా శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, స్పెషల్ ఆఫీసర్లు, మిషన్ భగీరధ డీఈ, ఏఈలు పాల్గొన్నారు.
వేసవి దృష్ట్యా ప్రణాళికలు
సిద్ధం చేయండి
కలెక్టర్ సంతోష్
Comments
Please login to add a commentAdd a comment