వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి
అలంపూర్: వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలను త్వరగా అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే విజయుడు సూచించారు. అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రికి ప్రధాన రోడ్డుకు సీసీ నిర్మాణ పనులను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆస్పత్రి ఇన్‌చార్జ్ డాక్టర్ సయ్యద్ బాషతో పరికరాలు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతోపాటుగా టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ డీఈ శ్రీనివాసులు, ఏఈ బాలక్రిష్ణ గౌడ్‌తో కలిసి ఆస్పత్రి ఆవరణ, పోస్టుమార్టం గదిని పరిశీలించారు. ప్రస్తుతం డిస్ట్రిక్ మినరల్ ఫండ్ ట్రస్టు(డీఎంఎఫ్‌టీ) నుంచి సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 28 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. 200 మీటర్ల సీసీ రోడ్డుతోపాటు పోస్టు మార్టం గది ఆవరణలో సీసీతో బెడ్ నిర్మాణం చేపడుతున్నట్లు డీఈ తెలిపారు. ఆస్పత్రిలో ఆవరణలో ముళ్ల పొదలు పెరిగాయని వాటిని తొలగించడానికి ప్రతిపాదనలు చేయాలని ఎమ్మెల్యే డీఈకి సూచించారు. వీలైనంత త్వరగా ఆస్పత్రిలో సౌకర్యాలు సమకూర్చి ఆస్పత్రిలో పేదలకు వైద్య సేవలు అందించడానికి చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గజేందర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్, సత్యనారయణ, బాషుమియ్య, మద్దిలేటి, తిరుమలేష్ నాయుడు, ధన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment