రాజకీయ వేఢీ | - | Sakshi
Sakshi News home page

రాజకీయ వేఢీ

Published Tue, Feb 25 2025 1:22 AM | Last Updated on Tue, Feb 25 2025 1:19 AM

రాజకీ

రాజకీయ వేఢీ

డీసీసీ పదవి కోసం..

తాజాగా డీసీసీ పదవి కోసం ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత నువ్వా.. నేనా అన్న తరహాలో పోటీపడుతున్నారు. ముఖ్యంగా సంపత్‌కుమార్‌, సరితలు ఓబీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నల్లారెడ్డి పేరును బలపరుస్తుండగా.. మరోవైపు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి పేరును బలపరుస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆది నుంచి మైనార్టీలు కాంగ్రెస్‌ పార్టీకి అండగా ఉంటున్నారని.. ఈసారి అధ్యక్ష పదవిని తమకే కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈక్రమంలో అనూహ్యంగా సీనియర్‌ న్యాయవాది కొండాపురం షఫివుల్లా అధ్యక్ష పీఠం రేసులో తాను కూడా ఉన్నానంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం పార్టీ ముఖ్యనాయకులైన సరిత మద్దతు సైతం కోరారు. అదే విధంగా తనకున్న పాత పరిచయాలతో పార్టీ పెద్దను కలిసి డీసీసీ పదవి ఇవ్వాలని కోరనున్నట్టు తెలిసింది.

ఎమ్మెల్యే బండ్ల X సంపత్‌, సరిత

ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు

పదవి దక్కించుకునేందుకు పావులు

మరోవైపు మైనార్టీలకు ఇవ్వాలంటూ

పెరుగుతున్న డిమాండ్‌

గద్వాల: జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ సెగ మొదలైంది. డీసీసీ పీఠాన్ని దక్కించుకునేందుకు ఓవైపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి.. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత తీవ్ర పోటీపడుతున్నారు. తమ అనుచరులకు ఎలాగైనా పదవిని కట్టబెట్టేందుకు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఇదిలా ఉండగా, జిల్లాలో ఆదినుంచి మైనార్టీలు కాంగ్రెస్‌ పార్టీకి సంపూర్ణ మద్దతు పలుకుతూ వస్తున్నారు. ఈసారి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిని మైనార్టీలకు ఇవ్వాలని గట్టిగానే డిమాండ్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఆశావహులు కూడా తెరమీదకు వచ్చారు. ఎమ్మెల్యే వర్గం నుంచి పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ వర్గం నుంచి నల్లారెడ్డి పేర్లు వినిపిస్తుండగా.. మైనార్టీల నుంచి సీనియర్‌ న్యాయవాది కొండాపురం షఫివుల్లా పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం వీరి పేర్లే ప్రధానంగా వినిపిస్తున్నాయి. అదే విధంగా పలువురు మైనార్టీ నాయకులు ఇదివరకే తమకు అవకాశం కల్పించాలని కోరుతూ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు.

కాంగ్రెస్‌కు కంచుకోట

నడిగడ్డ..

మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉండేవి. ఆదినుంచి కాంగ్రెస్‌ పార్టీకి నడిగడ్డ కంచుకోటగా ఉంటూ వస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం గడిచిన పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ పాలనలో కాంగ్రెస్‌ పార్టీ క్రమంగా బలహీనపడింది. ప్రధానంగా 2018లో డీకే అరుణ కాంగ్రెస్‌ పార్టీని వీడటంతో పూర్తిగా దెబ్బతింది. బలమైన నాయకులు లేక ఆ పార్టీ వాయిస్‌ వినిపించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలో జిల్లా అధ్యక్ష పదవిని పటేల్‌ ప్రభాకర్‌రెడ్డికి కట్టబెట్టిన అనంతరం మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ సమన్వయంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు.

బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌గా సరిత కొనసాగినప్పటికీ ఇరువర్గాల మధ్య ఆదిపత్య పోరు కొనసాగింది. ఈ నేపథ్యంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఆరునెలల ముందు గద్వాలలో బీసీ వాదం తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తెలివిగా పావులు కదిపి.. బీసీ వర్గానికి చెందిన సరితకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కేటాయించింది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో సరిత కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.

డీసీసీ పీఠం కోసం తీవ్ర పోటీ

అధిష్టానానికి తప్పని తలనొప్పి

పార్టీలో వర్గపోరు కారణంగా డీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలో అర్థం కాక అధిష్టానం తలపట్టుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి ఇరువర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు. పదవిని ఒకరికి ఇస్తే.. మరొకరు ఏవిధంగా స్పందిస్తారోనని.. ఆ పర్యవసానాలు ఏ స్థాయిలో ఉంటాయోనన్న మీమాంసలో ఉన్నట్టు సమాచారం. దీంతో అధిష్టానానికి డీసీసీ అధ్యక్ష పీఠం పీఠముడిగా మారింది

ఆది నుంచి వర్గపోరు..

No comments yet. Be the first to comment!
Add a comment
రాజకీయ వేఢీ 
1
1/3

రాజకీయ వేఢీ

రాజకీయ వేఢీ 
2
2/3

రాజకీయ వేఢీ

రాజకీయ వేఢీ 
3
3/3

రాజకీయ వేఢీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement