రాలుతున్న ఆశలు
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
వివరాలు 8లో u
ట్రాన్స్‌కో ఎస్‌ఈపై సస్పెన్షన్ వేటు..?
గద్వాల: ట్రాన్స్‌కో ఎస్‌ఈ తిరుమల్‌రావును సస్పెండ్ చేస్తూ సీఎండీ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ధరూరు మండలం అల్వాలపాడు సబ్‌స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు ఆందోళన చేసిన నేపథ్యంలో విచారణ జరిపిన రాష్ట్ర విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఎస్‌ఈ తిరుమల్‌రావుపై చర్యలకు ఆదేశిస్తూ సీఎండీ కార్యాలయానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. నివేదిక ఆధారంగా ఎస్‌ఈ తిరుమల్‌రావుపై సస్పెన్షన్ వేటు వేస్తూ సీఎండీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వ రకు వనపర్తి జిల్లా ఎస్‌ఈ రాజశేఖరమ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది.
మహిళల రక్షణ కోసమే షీటీంలు
గద్వాల క్రైం: మహిళల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్న జిల్లా షీటీం.. ఉత్తమ పనితీరు కనబరిచినట్లు ఎస్పీ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఆకతాయిల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలు, యువతులు, బాలికలకు షీ టీం సభ్యులు మనోఽదైర్యం అందిస్తున్నారని తెలిపారు. గడచిన 40 రోజుల వ్యవధిలో 13 మందిపై ఈ పెట్టి కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, నిత్యం ప్రధాన కూడలి, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల, కళాశాలలో మహిళా చట్టలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మహిళల్లో చైతన్యం తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. మల్టీజోన్ పరిధిలో జిల్లా షీటీం సిబ్బంది ఉత్తమ పనితీరు కనబర్చారని తెలిపారు. అత్యవసర సమయల్లో బాధితులు డయల్ 100 లేదా 8712670312కు సంప్రదించవచ్చని లేదా సామాజిక మాద్యమాల ద్వారా అయినా ఫిర్యాదు చేయవచ్చని తక్షణం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో గురువారం తగ్గింది. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు 2,418 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. గురువారం ఉదయానికి 365 క్యూసెక్కులకు తగ్గిపోయాయి. జూరాలలో నీటి మట్టం తగ్గడంతో రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు కర్ణాటక ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి 3 టీఎంసీల నీరు విడుదల చేయాలని కోరారు. దీంతో 6వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయగా.. ఇక్కడికి కేవలం 2,418 క్యూసెక్కులు 24 గంటల పాటు చేరాయి. అనంతరం పూర్తిగా ఇన్‌ఫ్లో తగ్గింది. తాగు, సాగు నీటికి ఈ సారి తిప్పలు తప్పేలా లేనట్లుగా కనిపిస్తోంది. ఆవిరి రూపంలో 75 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్టుకు 625, భీమా లిఫ్టు–1కు 550, కోయిల్‌సాగర్‌కు 220, ఎడమ కాల్వకు 550, కుడి కాల్వకు 375, ప్రాజెక్టు నుంచి మొత్తం 2495 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 4.721 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు.
●
వాతావరణంలో మార్పులతో మామిడి దిగుబడులపై ప్రభావం
పూత, పిందెలు రాలుతున్నాయి..
నాకు పది ఎకరాల మామిడి తోట ఉంది. 20 రోజుల నుంచి తోటకు బూడిద తెగుళ్లు, తేనెమంచు పురుగు ఉధృతి ఎక్కువైంది. ఎన్ని మందులు వాడినా పోవడం లేదు. దీనివల్ల పూత, పిందెలు రాలిపోతున్నాయి. ఈ ఏడాది దిగుబడులు తగ్గుతాయి.
– కొండయ్య, రైతు, కేటీదొడ్డి
దిగుబడులు తగ్గుతాయి.
నాకు సొంతంగా 6 ఎకరాల మామడి తోట ఉంది. మరో 10 ఎకరాలు గుత్తకు తీసుకున్నా. తోటకు పూత బాగా వచ్చింది. అయితే కొద్ది రోజుల నుంచి తేనెమంచు పురుగుతో పూత, పిందెలు రాలుతున్నాయి. ఈ ఏడాది దిగుబడులు తగ్గుతాయి. ఆర్థికంగా చాలా నష్టం.
– తెలుగు తిమ్మయ్య, రైతు, గట్టు మండలం
సలహాలు, సూచనలు
తీసుకోవాలి..
ఈఏడాది మామిడి తోటలకు పూత బాగా వచ్చింది. తేనెమంచు పురుగు ఉధృతి విషయం మా దృష్టికి వచ్చింది. మామిడి తోటలకు ఆశిస్తున్న తెగుళ్లు, పురుగుల నివారణకు రైతులు తగిన సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఉధ్యానశాఖ సిబ్బంది ద్వార రైతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తాం.
– ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి
గద్వాల వ్యవసాయం: మామిడి రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. గడిచిన పది రోజలుగా వాతావరణంలో వచ్చిన మార్పులు.. బూడిద తెగుళ్లు.. తేనెమంచు పురుగు ఉధృతి.. మామిడితోటలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పూత, పిందెలు రాలిపోతున్నాయి. కళ్లెదుటే రాలిపోతున్న పూత, పిందెలను చూస్తూ మామిడి రైతులు నిరాశ చెందుతున్నారు. దిగుబడులు తగ్గి ఆర్థికంగా నష్టాల పాలవుతామని ఆందోళనకు గురవుతున్నారు.
5వేల ఎకరాల్లో మామిడి..
ఉధ్యాన పంటలకు జిల్లాలో అనువైన పరిస్థితులు ఉన్నాయి. పండ్ల తోటల సాగుకు ఎర్రటి, ఒండ్రుతో కూడిన ఎర్రటి నేలలు ఉండాలి. నడిగడ్డలో ఇలాంటి నేలల శాతమే ఎక్కువగా ఉంది. సాగునీటి విషయానికి వస్తే జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్‌లతో పాటు, నెట్టెంపాడు ఎత్తిపోథల, రిజర్వాయర్లు, నోటిఫైడ్ చెరువులు, చెరువులు ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా బోర్లు, బావుల్లో ఆశించిన స్థాయిలో నీరు ఉంటోంది. సాధారణంగా పండ్ల తోటలను బోర్లు, బావుల కిందే సాగు చేస్తారు. ఈక్రమంలోనే జిల్లాలో మామిడి, బత్తాయి, పొప్పాయి, జామ, సపోట తదితర పండ్లతోటలను సాగు చేస్తున్నారు. అయితే జిల్లాలో మామిడి తోటలు సాగు ఎక్కువగా ఉంది. మిగలిన పండ్ల తోటలతో పోల్చితే మామిడి తోటలకు పెట్టుబడులు కాస్త తక్కువ, నిర్వహణ కూడా తక్కువే. జిల్లాలో 5020 ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా, ఈ ఏడాది 3430 ఎకరాల్లో కాపు దశలో ఉన్నాయి.
జిల్లా వివరాలిలా...
మండలం మొత్తం మామిడి కాపు దశలో
తోటలు (ఎకరాల్లో) ఉన్నవి
కేటీదొడ్డి 2,380 1,365
గట్టు 800 680
ధరూరు 550 425
మల్దకల్ 470 355
గద్వాల 300 190
అయిజ 150 110
ఇటిక్యాల 130 110
వడ్డేపల్లి 140 120
రాజోళి 70 60
అలంపూర్ 10 5
ఉండవల్లి 10 5
మానవపాడు 10 5
వాతావరణ మార్పులతో..
జిల్లాలో డిసెంబర్, జనవరి నెల నుంచే మామిడి చెట్లకు పూత పూయడం ఆరంభం అయ్యింది. పూత పూసిన నెల రోజుల తర్వాత పిందెలు కాయడం జరుగుతుంది. ఆ తర్వాత నెల, రెండు నెలలకి కాయ సైజు పెరుగుతూ వస్తుంది. అయితే జిల్లాలోని పలు ప్రాంతాల్లో మామిడి తోటలకు ఈసారి పూతలు బాగా వచ్చాయి. పూతలను చూసి రైతులు సంతోష పడ్డారు. వీరి సంతోషం ఎక్కువ రోజులు నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. వాతావరణంలో వచ్చిన మార్పులు.. బూడిద తెగుళ్లు, తేనెమంచు పురుగు మామిడి తోటలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గడిచిన పదిరోజలుగా రాత్రి వేళల్లో చలి ఉండటం, పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇలా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. దీనికితోడు చాలా ప్రాంతాల్లో బూడిద తెగుళ్లు, తేనెమంచు పురుగు విపరీతంగా ఆశిస్తోంది. ఈపురుగు విసర్జించే జిగురు లాంటి ద్రవాల వల్ల, బూడిద తెగుళ్లతో మామిడి పూతలు, పిందెలు రాలిపోతున్నాయి . కళ్లెదుటే రాలిపోతున్న పూతలు, పిందెలను చూస్తు మామిడి రైతు కనీళ్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా జనవరిలో పూత వచ్చి, ఫిబ్రవరిలో పిందెలు వచ్చిన చోట ఈపరిస్థితి ఎక్కువగా ఉంది. పిందెలు రాలి దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని రైతులు వాపోతున్నారు. ఎన్ని మందులు వాడుతున్నా ఈపురుగుల, తెగుళ్లు ఉధృతి తగ్గడం లేదని రైతులు అంటున్నారు. ఏడాదిగా కష్టప డుతూ, అనేక మందులు కొడుతూ తోటను కాపాడుకున్నా అనూహ్యంగా వాతావరణంలో వచ్చిన మార్పులు, తెగుళ్ల వల్ల దిగుబడులు తగ్గి, ఆర్థికంగా నష్టపోయే వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మామిడి తోటలను గుత్తకు తీసుకున్న రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పూతకు రాకముందే తోటలను వీళ్లు గుత్తకు (లీజ్) తీసుకుంటారు. పూత బాగా వచ్చి, ఇప్పుడు పిందెలు రాలడం వల్ల తమకు తీవ్రంగా ఆర్థిక నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు.
రాలిన పిందెలు
న్యూస్‌రీల్
తెగుళ్లు.. తేనెమంచు పురుగు ఉధృతి
పూత, పిందెలు రాలుతుండడంతో రైతుల ఆందోళన
రాలుతున్న ఆశలు
రాలుతున్న ఆశలు
రాలుతున్న ఆశలు
రాలుతున్న ఆశలు
రాలుతున్న ఆశలు
Comments
Please login to add a commentAdd a comment