గద్వాల: ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల లక్ష్యాలు, లేబర్ టర్న్ ఔట్, మెటీరియల్ కంపోనెంట్ తదితర వివరాలను మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. ప్ర తిమండలానికి కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. గ్రామల వారీగా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కూలీలకు అధిక ప్రాధాన్యత కల్పించేలా పనులను చేపట్టాలన్నారు. అదేవిధంగా చేసిన పనులకు సంబంధించి సకాలంలో వందశాతం చెల్లింపులు చేయాలని, జరిగిన పనులపై తానే స్వయంగా ప్రతివారం సమీక్షిస్తానని, నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment