ఎండలో మాడిపోవాల్సిందే
●
బస్ షెల్టర్లు నిర్మించండి
ప్రయాణికుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని గద్వాలలో బస్ షెల్టర్లు నిర్మించాలి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో బస్ షెల్ట ర్లు కొరత వేధిస్తోంది. ఇవి లేకపోవడం వలన ఆరుబయట ఎండ, వానలో ప్రయాణికులు అవస్థలు పడాల్సి వస్తోంది. మున్సిపల్, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో ముఖ్య కూడళ్లను గుర్తించి, బస్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలి. – అనిల్‌కుమార్, గద్వాల
ప్రయాణికుల ఇబ్బందులు
బస్సు షెల్టర్లు లేకపోవడం వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు బస్సులు ఆలస్యం అయితే చాలాసేపు ఎండలోనే ఉండిపోయే పరిస్థితి ఉంది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అనువైన చోట బస్సు షెల్టర్లను నిర్మించాలి. – వెంకటయ్య, గద్వాల
దాతల సహకారం కోరతాం
జిల్లా కేంద్రంతో పాటు పలు ముఖ్యమైన ప్రాంతాలలో బస్ షెల్టర్ల ఏర్పాటు ఆవశ్యకత ఉంది. ప్రయాణికుల వినతులను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులకు నివేదించాం. వీటి ఏర్పాటుపై గతంలోనే ప్రతిపాదనలు చేశారు. స్థానికంగా ఉన్న దాతల సహకారంతో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.
– మురళీకృష్ణ, ఆర్టీసీ డీఎం, గద్వాల
గద్వాలటౌన్: వేసవి రాకముందే ఎండలు మండుతున్నాయి.. రోడ్డుపైకి వెళ్తే కనీసం నిల్చునేందుకు కూడా నీడ కనిపించని దుస్థితి. ఇక ఆర్టీసీ బస్సుల కోసం వెళ్లే ప్రయానికుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ప్రయాణికుల కోసం కనీస సౌకర్యాల కల్పనలో ఆర్టీసీ అశ్రద్ద వహిస్తుంది. ప్రధానంగా ప్రయాణికులకు అవసరమైన సంఖ్యలో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, కూలి నాలి పని చేసుకునే వారు ఇలా ఒకరేంటి ప్రతి ఒక్కరు బస్సుల కోసం రోడ్లపైనే నిరీక్షించాలంటే నరకం కనిపిస్తోంది. నిల్వ నీడ లేక భానుడి ప్రతాపానికి మాడిపోతున్నారు. కొంత నీడ, కొన్ని ఇనుప బెంచీలుంటే ప్రయాణికులకు ఊరట లభిస్తుంది. అయితే ఆ కాస్త భాగ్యం కూడా లేదు. గంటల తరబడి రోడ్ల పక్కన నిల్చోని ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ బస్సుల కోసం నిత్యం ఎదురు చూడాల్సివస్తోంది.
ప్రయాణికులు పెరుగుతున్నా..
జిల్లా వ్యాప్తంగా బస్సు ప్రయాణికుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఆమేరకు షెల్టర్ల నిర్మాణం జరగడం లేదు. ప్రయాణికుల కోసం బస్సు షెల్టర్లు నిర్మించడం ఆర్టీసీ విధి. అయితే ఆర్టీసీ చురుకుగా వ్యవహరించకపోవడం వల్ల షెల్టర్లకు కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రంలో చాలాకాలం నుంచి షెల్టర్ల కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద కొన్ని ఏళ్ల క్రితం ఎల్‌ఐసీ నిర్వాహకులు, పీజేపీ క్యాంపు దగ్గర ఆ శాఖ ఉద్యోగులు స్వచ్ఛందంగా బస్సు షెల్టర్‌ను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఊరట కల్పించారు. ఈ రెండు షెల్టర్లే పట్టణ మొత్తానికి దిక్కుగా మారాయి. అయిజ, అలంపూర్ చౌరస్తా, శాంతినగర్ పట్టణాలతో పాటు ఎర్రవల్లి చౌరస్తా, ధరూర్, మల్థకల్, బల్గేర తదితర ప్రాంతాలలో ప్రయాణికుల రద్దీ నిత్యం ఉంటుంది. వందలాది మంది బస్సుల కోసం నిరీక్షిస్తుంటారు. ఇంతటి కీలకమైన ఈ ప్రాంతాలలో బస్సుషెల్టర్లు నిర్మించలేకపోతున్నారు. ఇక్కడ ఎండలోనే ప్రయాణికులు నిరీక్షించక తప్పని పరిస్థితి. ఓవైపు బస్ షెల్టర్ లేక.. బస్సులు రాక.. గంటలకొద్దీ ప్రయాణికులు ఎండలోనే మాడిపోతూ చేసేది లేక ప్రైవేటు వాహనాల్లో వేలాడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఆర్టీసీకి వచ్చే ఆదాయం ప్రైవేటు వాహనాల జేబుల్లోకి వెళ్తోంది. అదే బస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తే బస్సు కోసం వేచి ఉంటారు. ఫలితంగా ఆర్టీసీ ఆదాయం పెరుగుతోంది.
కానరాని బస్ షెల్టర్లు
బస్సుల కోసం ప్రయాణికుల పడరాని పాట్లు
చెట్లు.. దుకాణాల నీడే దిక్కు
జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి
ఎండలో మాడిపోవాల్సిందే
ఎండలో మాడిపోవాల్సిందే
ఎండలో మాడిపోవాల్సిందే
ఎండలో మాడిపోవాల్సిందే
ఎండలో మాడిపోవాల్సిందే
Comments
Please login to add a commentAdd a comment