సమగ్రాభివృద్ధికి బాటలు
గద్వాల నియోజకవర్గంలో రూ.130 కోట్లతో అభివృద్ధి పనులు
రూ.30 కోట్లతో విద్యుత్ సమస్యలకు చెక్
నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో రూ.30.25 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్లు, నూతన విద్యుత్ లైన్ల నిర్మాణాల పనులు చేపట్టనున్నారు. కెటి.దొడ్డి మండలంలోని మల్లాపురంలో రూ.83 లక్షలు, ఇర్కిచేడులో రూ.1.2 కోట్లు, వెంకటాపురంలో రూ.95 లక్షలు, నర్సన్‌దొడ్డిలో రూ.85 లక్షలు, పాతపాలెంలో రూ.85 లక్షలు, గద్వాల మండలంలోని జమ్మిచేడులో రూ.65లక్షలు, ధరూరు మండలంలోని మార్లబీడులో రూ.95లక్షలు, గద్వాల టౌన్‌లో రూ.4 కోట్లు, అదేవిధంగా డీటీఆర్ కింద గద్వాల నియోజకవర్గంలో(400) రూ.4కోట్లు, ధరూరు మండలంలో గుడ్డెందొడ్డి, పెద్దపాడు, గద్వాల మండలంలోని తుర్కోనిపల్లి, మల్దకల్ మండలంలో ఉలిగపల్లె, కుర్తిరావులచెర్వు, గట్టు మండలంలో తుమ్మలచెర్వు, సోంపురం, రాయపురం గ్రామాల్లో ఒక్కో గ్రామంలో రూ.3కోట్లు చొప్పున నూతనంగా 33/11కేవీ సబ్ స్టేషన్లు నిర్మాణాల కోసం నిధులు మంజూరీ అయ్యాయి. అదేవిధంగా గట్టులో 33/11కేవీ లైన్ నిర్మాణం కోసం రూ.95లక్షలు, గద్వాల నియోజకవర్గ పరిధిలో 11కేవీ ఫీడర్ నిర్మాణాల కోసం రూ.1.50కోట్లు, స్థంబాల ఏర్పాటు కోసం రూ.2కోట్లు నిధులు మంజూరీ అయ్యాయి.
● ఐదు మండలాల్లో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్లు
● సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అంగన్‌వాడీ భవనాలు, టాయిలెట్లు
● పురోగతిలో పనులు..పర్యవేక్షిస్తున్న కలెక్టర్
గద్వాల: గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు విడుదల అయ్యాయి. ఇందులో ప్రధానంగా సీసీ రహదారుల, బీటీ రహదారులు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాలలో టాయిలెట్స్ వంటి మౌళిక సదుపాయాలకు సంబంధించి సుమారు రూ.100 కోట్లకు పైనే నిధులు విడుదల కాగా, నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్లతో పాటు, విద్యుత్తు లైన్లు వంటి పనులకు రూ.30 కోట్లు మంజూరీ అయి కొన్ని చోట్ల పనులు సైతం పూర్తయ్యాయి. ఈ పనులన్నీంటిని కలెక్టర్ బీఎం సంతోష్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పురోగతి సాధించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఉపాధి హామీకి రూ.59.18 కోట్లు
జాతీయ ఉపాధి హామి పథకం కింద నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో మొత్తం రూ.59.18కోట్లు నిధులు మంజూరయ్యాయి. కాగా ఈనిధులను సీసీ రోడ్లు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ నిర్మాణాల కోసం వెచ్చిస్తున్నారు. ఇక కన్‌స్ట్రక్షన్ రూరల్ రోడ్ల పథకం కింద నియోజకవర్గ పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.10కోట్లు నిధులు మంజూరీ అయ్యాయి. వీటిని ఐదు మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో అంతర్గత సీసీ రహదారుల పనులు చేపట్టారు. అలాగే, మెయింటనెన్స్ రూరల్ రోడ్లు పథ కం కింద నియోజకవర్గానికి రూ.15.33 కోట్లు మంజూరు కాగా.. వీటి కింద నియోజకవర్గంలోని మండలాలకు వెళ్లు ప్రధాన బీటీ రహదారుల మెయింటనెన్స్ పనులు చేపట్టనున్నారు.
రూ.100 కోట్లతో
రహదారులు..
పంచాయతీ భవనాలు
గద్వాల నియోజకవర్గంలోని గద్వాల మున్సిపాలిటీ, గద్వాల, ధరూరు, గట్టు, కెటి.దొడ్డి, మల్దకల్ మండలాల పరిధిలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, నూతన పంచాయతీ భవనాలు, నూతన అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.100కోట్లు నిధులు విడుదల చేసింది. ఈ పనుల్లో చాలా వరకు మొదలు కాగా, కొన్ని పనులు చివరి దశలో కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఐదు మండలాల్లో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్లు, నూతన విద్యుత్ లైన్లు ఏర్పాటు కోసం రూ.30కోట్లు నిధులు మంజూరీ అయి కొన్ని పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా, స్పెషల్ డెవ్‌లప్‌మెంట్ ఫండ్ కింద నియోజకవర్గంలో రూ.10 నిధులు మంజూరయ్యాయి. ఈనిధుల ద్వారా ఐడు మండలాల పరిధిలోని వివిధ గ్రామ పంచాయతీలలో మౌళిక వసతులైన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, తాగునీటి వసతి వంట పనులు చేపడుతున్నారు.
అభివృద్ధి కృషి
గద్వాల నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నా. ఎక్కడెక్కడా ఏఏ పనులు అవసరమో తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రభుత్వానికి నివేదికలు పంపి అవసరమైన నిధులు తీసుకొచ్చేలా కృషిచేస్తున్నా. 2024–25ఏడాదిలో వివిధ రకాల అభివృద్ధి పనులు, విద్యుత్తు లైన్ల నిర్మాణాల కోసం రూ.134కోట్లు మంజూరయ్యాయి. ఈపనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి.
– బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల
త్వరగా పూర్తయ్యేలా..
ఎస్‌డీఎఫ్, ఈజీఎస్, ఎంఆర్‌ఆర్, సీఆర్‌ఆర్ కింద విడుదలైన నిధులతో చేపట్టిన పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తయ్యేలా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నాను. పనుల పురోగతిపై వివరాలు తెలుసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నాను.
– బీఎం సంతోష్, కలెక్టర్
●
సమగ్రాభివృద్ధికి బాటలు
సమగ్రాభివృద్ధికి బాటలు
Comments
Please login to add a commentAdd a comment