అనధికార జీపీ లేఅవుట్లకు అక్రమ రిజిస్ట్రేషన్లు..
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లు, రిజిస్ట్రేషన్ లేని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020 సెప్టెంబర్‌లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించింది. 2020 ఆగస్టు 26లోగా సేల్‌డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన లేఅవుట్ యజమానులు, ప్లాటు ఓనర్లకు ఎల్‌ఆర్‌ఎస్ వర్తిస్తుందని ప్రకటించింది. 2021లో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు స్వీకరించింది. ఆ తర్వాత ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. అనుమతి లేని లేఅవుట్లు, అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లను గత సర్కార్ నిలిపివేయడం కొందరు సబ్ రిజిస్ట్రార్లకు కాసులపంట పండించింది. 2021 నుంచి 2024 వరకు పలువురు రిజిస్ట్రేషన్ అధికారులు ఎల్‌ఆర్‌ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు పరిష్కారం కాకుండానే.. రియల్టర్లతో కుమ్మకై ్క వేల సంఖ్యలో అనధికార జీపీ లేఅవుట్లకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రస్తుతం 25 శాతం రాయితీ కల్పించినా.. రిజిస్ట్రేషన్ పూర్తయిన నేపథ్యంలో ఎప్పుడైనా క్రమబద్ధీకరించుకోవచ్చనే ఉద్దేశంతో ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది.