రైతులు జాగ్రత్తగా ఉండాలి
చాలా మంది ప్రజలు మాపై నమ్మకంతో అమరవాయి గ్రామానికి వచ్చి జ్యోతిష్యం, పంచాంగం చెప్పించుకుంటారు. మా గురువుల నుంచి నేర్చుకున్న జ్యోతిష్యం, పంచాంగ శ్రవణాన్ని ఏళ్లుగా ప్రజలకు వివరిస్తూ వస్తున్నా. ఇక.. ఈ విశ్వవాసు నామ సంవత్సరం విషయానికి వస్తే ప్రేమ వివాహలు ఎక్కువగా జరుగుతాయి. రెండు తుమ్ముల వాన, ఒక తుమ్ము గాలి విస్తాయి. రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి రెండు సార్లు ఆలోచించి పంట సాగు చేయాలి. పంట చేతికి వచ్చే సమయంలో ధర రాదు.. ధర వచ్చినప్పుడు పంట చేతిలో ఉండదు. నలుపు, తెలుపు, ఎరుపు పంటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అగ్ని, వాహన ప్రమాదాలు ఎక్కువగా అవుతాయి. – మేళ్ల చెరువు రేవతీనాథ్‌శర్మ,
అమరవాయి, మానవపాడు మండలం


