54 ఏళ్లుగా జ్యోతిష్యం.. పంచాంగం
మానవపాడు: మానవపాడు మండలం అమరవాయి గ్రామానికి చెందిన మేళ్ల చెరువు రేవతీనాథ్‌శర్మ 54 ఏళ్లుగా జ్యోతిష్యం.. పంచాంగ శ్రవణం వినిపిస్తూ వస్తున్నారు. రాష్ట్రం నుంచేగాక ఆంధప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రజలు పంచాంగం, జ్యోతిష్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. మానవపాడు మండలంలోని చెన్నిపాడు గ్రామానికి చెందిన ఆఫీస్ నాగిరెడ్డితోపాటు దత్రాత్రేయశాసీ్త్ర, విజయవాడ నాగేశ్వరశాస్త్రీ వద్ద రేవతీనాథ్‌శర్మ పంచాంగం, జ్యోతిష్యం నేర్చుకున్నారు. నాటి నుంచి ప్రజలకు జ్యోతిష్యం, పంచాంగం వివరిస్తూ వస్తున్నారు. అలాగే, ఉత్తమ అర్చకుడిగా ఉమ్మడి మహబూబ్‌నగర్ కలెక్టర్ శ్రీదేవి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.


