అన్నదాతకు ఊరట
2025–26 ఆర్థిక సంవత్సరం పంట రుణపరిమితి పెంపు
వివరాలు 8లో u
●
ఆదేశాలు జారీ..
పంట రుణాల పరిమితిని పెంచుతూ ఎస్‌ఎల్‌టీసీ నుంచి ఇటీవలే ఉత్తర్వులు అందాయి. ఈ వివరాలను జిల్లాలోని అన్ని బ్యాంకులకు పంపించాం. 2025–26 వానాకాలం, యాసంగి సీజన్‌లలో పెంచిన రుణ పరిమితికి అనుగుణంగా పంట రుణాలు అందించాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశాం. ఈ మేరకు బ్యాంకర్లు పంట రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటాం.
– అయ్యపురెడ్డి, ఎల్‌డీఎం
గద్వాలన్యూటౌన్: బ్యాంకుల ద్వారా రైతులకు అందించే పంట రుణాల పరిమితి పెరిగింది. వివిధ రకాల పంటలకు ఇచ్చే రుణాల పరిమితిని పెంచుతూ జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ (డీఎల్‌టీసీ) చేసిన ప్రతిపాదనలను ఎస్‌ఎల్‌టీసీ ఆమోదించింది. ఈ నిర్ణయంతో ఏటా పంట రుణాలు పొందుతున్న అన్నదాతలకు ప్రయోజనం చేకూరనుంది.
ప్రతి ఆర్థిక సంవత్సరంలో పెంపు..
ప్రతి ఆర్థిక సంవత్సరానికి ముందు డీసీసీబీ ఆద్వర్యంలో ఉమ్మడి జిల్లాస్థాయిలో బ్యాంకర్లు, వ్యవసాయశాఖ, అనుబంధ శాఖల అధికారులతో జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో వివిధ రకాల పంటలకు అయ్యే పెట్టుబడులు, ఇతరాత్ర అయ్యే ఖర్చులు, గడిచిన ఆర్థిక సంవత్సరం ఆయా పంటలకు ఇచ్చిన రుణాల గురించి చర్చిస్తారు. ఆయా పంటలకు బ్యాంకుల ద్వారా అందించాల్సిన రుణాలు ఎంతమేర పెంచాలో చర్చించి, ప్రతిపాదనలు రూపొందిస్తారు. ఇందులో భాగంగా 2025–26 వానాకాలం, యాసంగి సీజన్‌లో ఉమ్మడి జిల్లాలో పంట రుణ పరిమితిపై గత మార్చిలో నిర్వహించిన డీఎల్‌టీసీ సమావేశంలో పంట రుణపరిమితిపై ప్రతిపాదనలు రూపొందించి స్టేట్ లెవెల్ టెక్నికల్ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ)కి నివేదించారు. అధికారులు అక్కడ మరోసారి చర్చించి.. పంట రుణపరిమితిని పెంచుతూ మార్చి 26న నిర్ణయం తీసుకున్నారు. దాదాపు అన్ని రకాల పంటలకు రూ. వెయ్యి నుంచి రూ. 2వేల వరకు పెంచారు. అదే విధంగా కూరగాయల తోటలకు సంబంధించి సాధారణ సాగుకు రూ. వెయ్యి నుంచి రూ. 2వేల వరకు, మల్చింగ్ పద్ధతిన సాగుకు రూ. 2వేల నుంచి రూ. 3వేల వరకు రుణపరిమితిని పెంచారు.
గతేడాది ఎకరాకు ఇచ్చిన, ఈఏడాది ఇవ్వనున్న రుణ వివరాలు (రూ.లలో)..
ప్రధాన పంటలకు ఇలా..
పంట 2024–25 2025–26
వరి 43,000–45,000 44,000–46,000
వరి (సీడ్) 48,000–50,000 48,000–50,000
జొన్న 18,000–20,000 19,000–21,000
జొన్న (సీడ్) 22,000–25,000 24,000–26,000
మొక్కజొన్న 32,000–34,000 34,000–36,000
సజ్జ 15,000–17,000 16,000–18,000
కంది 22,000–24,000 23,000–25,000
పప్పుశనగ 24,000–26,000 25,000–27,000
పత్తి 44,000–46,000 46,000–48,000
పత్తి (సీడ్) 1,40,000–1,50,000 1,40,000–1,50,000
వేరుశనగ 28,000–30,000 30,000–32,000
ఆముదం 19,000–20,000 20,000–21,000
పండ్లతోటలకు ఇలా..
రకం 2024–25 2025–26
మామిడి 42,000–44,000 45,000–47,000
మామిడి (హైడెన్సిటి) 60,000–65,000 64,000–66,000
పొప్పాయి 65,000–67,000 67,000–69,000
కలంగడి 33,000–35,000 34,000–36,000
జామ 45,000–47,000 47,000–49,000
బత్తాయి 43,000–45,000 45,000–47,000
దానిమ్మ 75,000–77,000 76,000–78,000
నిమ్మ 48,000–50,000 50,000–52,000
కూరగాయలకు ఇలా..
రకం 2024–25 2025–26
ఎండుమిర్చి 82,000–84,000 84,000–86,000
టమాటా 53,000–55,000 55,000–57,000
వంకాయ 38,000–40,000 40,000–42,000
ఉల్లి 43,000–45,000 45,000–47,000
బెండ 28,000–30,000 30,000–32,000
క్యాబేజీ 33,000–35,000 33,000–35,000
క్యాలీఫ్లవర్ 32,000–34,000 33,000–35,000
మునగ 33,000–35,000 34,000–36,000
క్యాప్సికమ్ 48,000–50,000 50,000–52,000
బ్యాంకు రుణాలపైనే ఆధారం..
జోగుళాంబ గద్వాల వ్యవసాయ ఆధారిత జిల్లా. వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఇక్కడ జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్టులతో పాటు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఏడు రిజర్వాయర్లు, 120 దాకా చెరువులు, కుంటలు ఉన్నాయి. జిల్లాలో వేలాది మంది సన్న, చిన్నకారు రైతులు ఏటా పంట పెట్టుబడులకై బ్యాంకు రుణాలపైనే ఆధార పడతారు. పంట రుణ పరిమితి పెంచడం రైతులకు ఊరట కలిగించే విషయమని చెప్పవచ్చు. ఏటా పంట పెట్టుబడులు పెరుగుతున్నాయి. కాాలం కలిసి వస్తేనే అన్నదాతకు కొంత డబ్బు మిగులుతోంది. పంట పెట్టుబడులకు రైతుభరోసా, కిసాన్ సమ్మాన్ యోజన లాంటి పథకాలు ఉన్నా.. వాటితో రైతుల అవసరాలు పూర్తిగా తీరవు. ఈక్రమంలో బ్యాంకుల ద్వారా పంట రుణాలు తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తోంది.
ఎకరాకు రూ. 3వేల వరకు పెంచుతూ ఎస్‌ఎల్‌టీసీ ఉత్తర్వులు
బ్యాంకర్లకు ఆదేశాలు జారీ
వానాకాలం, యాసంగి సీజన్‌లలో రుణాలు పొందే రైతులకు ప్రయోజనం
అన్నదాతకు ఊరట
అన్నదాతకు ఊరట


