‘సొర ’ దొరకాల్సి ఉంది
అవినీతిమయంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
తాజాగా రెవెన్యూ ఇన్‌చార్జి అధికారి నరేందర్ ఇళ్లపై ఏసీబీ దాడులు
రూ.6.7 కోట్ల విలువైన నగదు, ఆస్తులు స్వా«దీనం
అవినీతి, అక్రమాలపై ‘సాక్షి’లో గతంలో వరుస కథనాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ మున్సి పల్ కార్పొరేషన్‌లో అవినీతి, అక్రమాలకు హద్దు లే కుండా పోయింది. తాజాగా సూపరింటెండెంట్, ఇ న్‌చార్జి రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న దాసరి న రేందర్ ఇళ్లలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఏసీబీ అ ధికారుల బృందం సోదాలు చేసింది. ఈ తనిఖీల్లో విస్తుపోయే రీతిలో నగదు, బంగారం, ఆస్తులు ల భ్యమయ్యాయి. నరేందర్ ఇంట్లో ఏకంగా రూ. 6,07,81,000 విలువైన నగదు, ఆస్తుల పత్రాలను అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నరేందర్ ఇంట్లో రూ.2,93,81,000 నగ దు, అతని భార్య, తల్లి బ్యాంకు ఖాతాల్లో రూ.1.10 కోట్ల నిల్వలున్న పాస్‌బుక్‌లు, 51 తులాల బంగారం, రూ.1.98 కోట్ల విలువైన స్థిరాస్తి పత్రాలు ల భించాయి. ఈ నేపథ్యంలో ఇందూరు నగరంలో ఈ విషయమై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్‌లోని అవినీతి అ క్రమ వ్యవహారాల్లో ఏసీబీ ఎరకు కేవలం చిన్న చేప మాత్రమే దొరికిందని, అసలైన సొర చేప చిక్కాల్సి ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
‘సాక్షి’లో వరుస కథనాలు
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి, అక్రమ వ్యవహారాలపై, అస్తవ్యస్త పాలనపై, ప్రభుత్వ ఫీజులకు గండి కొట్టే తీరుపై , ఒక్క ఐడీపై అనేక దరఖాస్తులు, దరఖాస్తుదారులతో దొంగాటలు టీఎస్ బీపాస్‌లో అవకతవకలపై వరుస కథనాలు ‘సాక్షి’లో ప్రచురితమయ్యాయి. ఈ కథనాలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఇక కార్పొరేషన్‌లోని అవినీతి, అక్రమాలలో పరాకాష్టకు చేరిన పెద్ద తిమింగలాన్ని సైతం పట్టుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. నరేందర్‌ను అడ్డం పెట్టుకుని ఒక కీలక అధికారి విచ్చలవిడిగా దండుకున్నట్లు పలువురు చెబుతున్నారు.
ఈ క్రమంలో నరేందర్ సైతం విచ్చలవిడిగా అక్రమ వసూళ్లు చేశాడు. నరేందర్ అక్రమాస్తులే ఈ స్థాయిలో ఉంటే సదరు పెద్ద తిమింగలం ఆస్తులు ఏ స్థాయిలో ఉన్నాయో అని మాట్లాడుకుంటున్నారు. ఫైళ్ల కదలికకు సంబంధించి అంతా ఓటీపీ మాయాజాలం అంటూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. బిల్డింగ్ పర్మిషన్స్ నుంచి మ్యుటేషన్ల వరకు అన్నింటా భారీగా వసూళ్లే లక్ష్యంగా మున్సిపల్ కార్పొరేషన్‌ను దోపిడీకి అడ్డాగా మార్చినట్లు బహిరంగంగానే ఆరోపణలు వస్తున్నాయి. నరేందర్ విషయానికి వస్తే బినామీలను ఏర్పాటు చేసుకుని ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లను, మరో ఇద్దరు ప్రైవేటు బిల్డింగ్ ప్లానర్స్‌ను, ఒక ప్రైవేటు డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకుని వసూళ్ల దందాకు పాల్పడినట్లు తెలుస్తోంది.
పైగా నగరంలో ఒక మెడికల్ ఏజెన్సీ, నాలుగు ప్రైవేటు ఆస్పత్రుల్లో వాటాలు ఉన్నట్లు పలువురు చెబుతున్నారు. బినామీల పేరిట అనేక ఆస్తులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇతనిపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ నాయకులు కొందరు నరేందర్ వ్యవహారాలపై నిఘా పెట్టి ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సుదీర్ఘకాలంగా ఏళ్లతరబడి ఇక్కడే పనిచేస్తున్న నరేందర్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా శోధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో విచారణ చేయాలని, అదేవిధంగా బడా తిమింగలాన్ని సైతం చేజిక్కించుకోవాలని నగర ప్రజలు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment