Nizamabad Municipal Corporation
-
ఎరకు చిక్కింది చిన్న చేపనే..!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ మున్సి పల్ కార్పొరేషన్లో అవినీతి, అక్రమాలకు హద్దు లే కుండా పోయింది. తాజాగా సూపరింటెండెంట్, ఇ న్చార్జి రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న దాసరి న రేందర్ ఇళ్లలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఏసీబీ అ ధికారుల బృందం సోదాలు చేసింది. ఈ తనిఖీల్లో విస్తుపోయే రీతిలో నగదు, బంగారం, ఆస్తులు ల భ్యమయ్యాయి. నరేందర్ ఇంట్లో ఏకంగా రూ. 6,07,81,000 విలువైన నగదు, ఆస్తుల పత్రాలను అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నరేందర్ ఇంట్లో రూ.2,93,81,000 నగ దు, అతని భార్య, తల్లి బ్యాంకు ఖాతాల్లో రూ.1.10 కోట్ల నిల్వలున్న పాస్‌బుక్‌లు, 51 తులాల బంగారం, రూ.1.98 కోట్ల విలువైన స్థిరాస్తి పత్రాలు ల భించాయి. ఈ నేపథ్యంలో ఇందూరు నగరంలో ఈ విషయమై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్‌లోని అవినీతి అ క్రమ వ్యవహారాల్లో ఏసీబీ ఎరకు కేవలం చిన్న చేప మాత్రమే దొరికిందని, అసలైన సొర చేప చిక్కాల్సి ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.‘సాక్షి’లో వరుస కథనాలునిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి, అక్రమ వ్యవహారాలపై, అస్తవ్యస్త పాలనపై, ప్రభుత్వ ఫీజులకు గండి కొట్టే తీరుపై , ఒక్క ఐడీపై అనేక దరఖాస్తులు, దరఖాస్తుదారులతో దొంగాటలు టీఎస్ బీపాస్‌లో అవకతవకలపై వరుస కథనాలు ‘సాక్షి’లో ప్రచురితమయ్యాయి. ఈ కథనాలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఇక కార్పొరేషన్‌లోని అవినీతి, అక్రమాలలో పరాకాష్టకు చేరిన పెద్ద తిమింగలాన్ని సైతం పట్టుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. నరేందర్‌ను అడ్డం పెట్టుకుని ఒక కీలక అధికారి విచ్చలవిడిగా దండుకున్నట్లు పలువురు చెబుతున్నారు. ఈ క్రమంలో నరేందర్ సైతం విచ్చలవిడిగా అక్రమ వసూళ్లు చేశాడు. నరేందర్ అక్రమాస్తులే ఈ స్థాయిలో ఉంటే సదరు పెద్ద తిమింగలం ఆస్తులు ఏ స్థాయిలో ఉన్నాయో అని మాట్లాడుకుంటున్నారు. ఫైళ్ల కదలికకు సంబంధించి అంతా ఓటీపీ మాయాజాలం అంటూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. బిల్డింగ్ పర్మిషన్స్ నుంచి మ్యుటేషన్ల వరకు అన్నింటా భారీగా వసూళ్లే లక్ష్యంగా మున్సిపల్ కార్పొరేషన్‌ను దోపిడీకి అడ్డాగా మార్చినట్లు బహిరంగంగానే ఆరోపణలు వస్తున్నాయి. నరేందర్ విషయానికి వస్తే బినామీలను ఏర్పాటు చేసుకుని ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లను, మరో ఇద్దరు ప్రైవేటు బిల్డింగ్ ప్లానర్స్ను, ఒక ప్రైవేటు డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకుని వసూళ్ల దందాకు పాల్పడినట్లు తెలుస్తోంది. పైగా నగరంలో ఒక మెడికల్ ఏజెన్సీ, నాలుగు ప్రైవేటు ఆస్పత్రుల్లో వాటాలు ఉన్నట్లు పలువురు చెబుతున్నారు. బినామీల పేరిట అనేక ఆస్తులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇతనిపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ నాయకులు కొందరు నరేందర్ వ్యవహారాలపై నిఘా పెట్టి ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సుదీర్ఘకాలంగా ఏళ్లతరబడి ఇక్కడే పనిచేస్తున్న నరేందర్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా శోధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో విచారణ చేయాలని, అదేవిధంగా బడా తిమింగలాన్ని సైతం చేజిక్కించుకోవాలని నగర ప్రజలు అంటున్నారు. -
కార్పొరేషన్ రోడ్లు ఆర్ అండ్ బీకి..
► పార్కుల పనులు ‘పంచాయతీరాజ్’కు.. ► నాణ్యతా ప్రమాణాల కోసం కీలక నిర్ణయాలు.. ► నగర సుందరీకరణకు రూ.వంద కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులంటేనే కొందరు నేతలు, అధికారుల పంట పండుతోంది. ఇంజనీరింగ్ అధికారులకైతే ‘ఫిక్స్డ్’ పర్సెంటేజీలు కాగా, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనులకు సంబంధిత ప్రజాప్రతినిధికి పెద్ద మొత్తంలో ముట్టజెప్పాల్సిందే. దీంతో ఆయా అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకమవుతోంది. రూ.కోట్లు వెచ్చించి నగరంలో నిర్మించిన రోడ్లు మూడు, నాలుగు నెలల్లోనే గుంతల మయం అవుతుండగా, డ్రైనేజీలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్‌కు మంజూరైన నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనుల నుంచి ఇంజనీరింగ్ విభాగాన్ని తప్పించింది. ఈ పనులను ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించాలని నిర్ణయించారు. ఇటీవల కలెక్టర్ యోగితారాణా, స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త కార్పొరేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్శాఖలఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మంజూరు చేసిన నిధులు కావడంతో పనుల్లో నాణ్యత పక్కాగా ఉండేలా చూడాలని నిర్ణయించారు. 43 అంతర్గత రహదారులు.. నిజామాబాద్ నగర సుందరీకరణ కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రూ.వంద కోట్ల నిధులను మంజూరు చేశారు. ఇందులోభాగంగా నగరంలో 43 అంతర్గత రహదారులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ పనులను ఆర్ అండ్ బీ శాఖకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ రహదారుల జాబితాను ఆర్ అండ్ బీకి అప్పగించారు. ఈ మేరకు అంచనాలను తయారు చేయాలని ఆర్ అండ్ బీ ఉన్నతా«ధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఈ శాఖ అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే రోడ్ల పరిశీలన పూర్తి కాగా, మ్యాపుల్లో గుర్తింపు వంటి ప్రక్రియను పూర్తి చేశారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పక్కనే అసంపూర్తిగా నిలిచిపోయిన కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేసే పనులను కూడా ఆర్ అండ్ బీకి అప్పగించారు. నగరంలో కూడళ్ల (జంక్షన్) అభివృద్ధి, కూరగాయలు, మాంసం మార్కెట్ల అభివృద్ధి పనులను కూడా ఈ శాఖకే అప్పగించారు. రాజీవ్ ఆడిటోరియం పీఆర్‌కు.. రాజీవ్‌గాంధీ ఆడిటోరియం అభివృద్ధి పనులను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంతో చేయించాలని భావిస్తున్నారు. అలాగే నగరంలో ఉన్న పార్కుల అభివృద్ధి పనులను కూడా పీఆర్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు అంచనాల తయారీల్లో నిమగ్నమయ్యారు. కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అనుకున్న మేరకు అధికారులు సిబ్బంది అందుబాటులో లేరు. పైగా పెద్ద మొత్తంలో అభివృద్ధి నిధులు ఒక్కసారిగా రావడంతో ఈ పనులను పర్యవేక్షించేందుకు ఇంజనీరింగ్ విభాగానికి తలకు మించిన భారంగా తయారవుతోంది. దీంతో పనులు పూర్తవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అసంపూర్తి పనులతో నగర వాసులు పడరాని పాట్లు పడుతున్నారు. వీటన్నింటికి ప్రత్యామ్నాయ మార్గంలో ఈ అభివృద్ధి పనులను వివిధ శాఖలకు అప్పగించాలని నిర్ణయించడంతో సకాలంలో పనులు పూర్తవుతాయని జిల్లా అధికార యంత్రాంగం భావిస్తోంది. -
నిజామాబాద్ కార్పొరేషన్‌కు రూ. 54కోట్ల నిధులు
జీవో జారీ చేసిన కేటీఆర్ నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.54 కోట్ల నిధులు విడుదల చేస్తూ బుధవారం మంత్రి కేటీఆర్ జీవోను జారీ చేశారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో కేటీఆర్ తనను కలిసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాకు ఈ సందర్భంగా అందజేశారు. రూ. 100కోట్ల మంజూరీలో భాగంగా మొదట రూ. 54కోట్ల మంజూరుకు జీవో విడుదల కాగా రూ. 46కోట్లను త్వరలో మంజూరు చేయనున్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
నొక్కేయ్... మెక్కేయ్!
♦ ప్రకటన బోర్డుల టెండర్లలో అవినీతి ♦ బస్టాపులను అప్పనంగా అప్పగించారు.. ♦ కార్పొరేషన్‌కు ఏటా రూ.లక్షలు గండి ♦ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగితేనే అక్రమాలు తేలేది? సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరపాలక సంస్థలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అధికార ముసుగులో దోపిడీ కొనసాగుతోంది. నగరంలోని రహదారి డివైడర్లపై బోర్డులు, బస్టాపులపై ప్రకటనలకు ఎటువంటి టెండర్లు నిర్వహించకుండానే అయినవారికి అప్పనంగా అప్పగించేశారు. ఎనిమిదేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. నగరపాలక సంస్థలో కొన్ని విభాగాలు చూపుతున్న చేతివాటం పాలకవర్గానికి చేటు తెస్తున్నది. ప్రకటనల బోర్డుల ఏర్పాటు టెండర్లు, గత ఎనిమిదేళ్లలో వచ్చిన ఆదాయం, పక్కదారి పట్టిన నిధులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ప్రకటన బోర్డుల కాంట్రాక్టులో అవినీతి నిజామాబాద్ నగర పాలక సంస్థ రహదారులు చుట్టూ 20 కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్నారుు. ఇందులో 10 కిలోమీటర్ల మేర రహదారులకు మధ్యభాగంలో డివైడర్లపై ప్రకటన బోర్డులకు ఏటా టెండర్లు నిర్వహిస్తారు. కానీ.. గత ఎనిమిదేళ్లుగా ఒకే సంస్థకు కాంట్రాక్టు అప్పగించడం.. అలాగే టెండర్ల ద్వారా ఏటా సగటున రూ.2 లక్షల ఆదాయం రాకపోవడం అధికారుల అక్రమాలకు అద్దం పడుతోంది. ఎనిమిదేళ్లుగా ఒక సంస్థ ఏటా కాంట్రాక్టును రూ.2 లక్షలకు లోపు దక్కించుకుంటోంది. ఈ నిర్వాకంలో కొందరు అధికారులు, ప్రజాప్రతినిధుల మితిమీరిన ప్రమేయం కూడా ఉండటంతో ఏటా రూ. 10 లక్షల వరకు వచ్చే ఆదాయం రూ.2 లక్షలకే పరిమితం అవుతున్నది. ఎనిమిదేళ్లుగా డివైడర్ల బోర్డు ప్రకటనల ద్వారా రూ.10.14 లక్షలు మాత్ర మే వచ్చిందంటే అధికారుల అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ చ్చు. ఏటా సగటున రూ.10 వేలు పెంచుకుంటూ కాంట్రాక్టును ఒక సం స్థకు అప్పగిస్తూ భారీగా ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉ న్నారుు. అరుునా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. గతంలో పనిచేసిన ఇద్దరు కమిషనర్లు కూడా చూసీచూడనట్లు విడిచిపెట్టడం.. అ లాగే కాంట్రాక్టుల విషయంలో కొందరు కార్పొరేటర్ల మితిమీరిన జోక్యం కూడా నగరపాలక సంస్థ అవినీతికి కేంద్ర బిందువుగా మారడానికి కారణమవుతున్నది. అప్పనంగా అప్పగించేశారు.. జిల్లా కేంద్రంలో నగర పాలక సంస్థ ఆధీనంలో ప్రస్తుతం 12 బస్టాపులు ఉన్నాయి. గతంలో ఒక దాత వీటిలో కొన్నింటిని నిర్మించాడని ఉదారంగా ప్రకటనల కోసం అతనికి బస్టాపులను అప్పగించారు. బస్టాపులను నిర్మి స్తే ఆయన పేరు పెట్టుకొని స్మరించాలి లేదంటే నలుగురిలో సన్మానం చే యాలి కానీ.. లక్షల ఆదాయూన్ని తెచ్చిపెట్టే బస్టాపులపై ప్రకటన బోర్డులకు కాంట్రాక్టు కోసం టెండర్లు నిర్వహించకుండా కొన్నేళ్లుగా ఒకే వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తున్నారు. కొన్నేళ్లుగా నిబంధనలు తుంగలో తొక్కి టెండర్లు నిర్వహించకుండా అందినకాడికి దండుకోవడం అధికారులకు రివాజు గా.. దాతకు ఆదాయవనరుగా మారింది. ఇప్పటికైనా ఇంటెలిజెన్స్ అధికారులు స్పందించి లోతుగా విచారణ జరిపితే అక్రమాల పుట్ట ఒక్కొక్కటిగా బయటపడే అవకాశం కలదు. -
నోటిమాట... నోటు వాటా
* అంతస్తులపై అంతస్తుకు ఇవే ప్రమాణాలు * నగరం,పట్టణాలలో యథేచ్ఛగా అక్రమకట్టడాలు * ప్రణాళిక అధికారులు, ప్రజాప్రతినిధులే సూత్రధారులు * నిబంధనలను తుంగలో తొక్కుతున్న బిల్డర్లు * చేష్టలుడిగిన పాలనా యంత్రాంగం * అశోకా టవర్స్ ఘటనతో బయటపడ్డ లొసుగులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరపాలక సంస్థ, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు పురపాలక సంఘాల పరిధిలో మొత్తం సుమారు 124 బహుళ అంతస్థు (అపార్టుమెంట్)ల సముదా యాలు ఉన్నాయి. వాటిలో 28 పైగా కట్టడాలు, నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ఖజానాకు నిధులు సమకూరేలా, నిబంధనలు కఠి నంగా అమలయ్యేలా వ్యవహరించాల్సిన అధికారులు భవన యజమానుల స్వార్థమే ఆసరాగా, తమ స్వలాభం చూసుకుంటున్నారు. రెవెన్యూ, పట్టణ ప్రణాళిక రెండూ ఒక శాఖలోని విభాగాలే. ఒకటి అక్రమ నిర్మాణాలు, కట్టడాలను నిరోధించి పట్టణాల రూపురేఖలు ప్రణాళికాబద్ధంగా ఉండేలా పర్యవేక్షించాలి. మరొకటి నిర్మితమైన క ట్టడాలు, ఖాళీ స్థలాల నుంచి నగర, పురపాలక సంస్థలకు పన్నుల రూపంలో ఆర్థిక వనరులు సమకూర్చాలి. రెండు శాఖల మధ్యన సమన్వయం ఉంటే నగర, పురపా లక సంఘాలకు కోట్ల రూపాయల ఆదాయం దక్కేది. అక్రమ నిర్మాణాలు చోటు చేసుకుంటున్నా పట్టణ ప్రణాళిక విభాగం జేబులు నింపుకొని కళ్లు మూసుకుంటోంది. రెవెన్యూ విభాగం అక్రమ నిర్మాణాలకు అదనపు రుసుము వసూలు చేసి చేతులు దులుపుకుంటోంది. రెండు శాఖల మధ్య సమన్వయాన్ని పెంచి ఆదాయం చేకూరేలా చ ర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఒక ప్రణాళిక అంటూ లేకుండా నిర్మా ణాలు కొనసాగుతుండటంతో నగరం, పట్టణాల రూపురేఖలు మారిపోతున్నాయి. అవినీతి దరువు పట్టణాలలో ఏ చిన్న నిర్మాణం చేపట్టాలన్నా పట్టణ ప్రణాళిక విభాగం అనుమతి తప్పనిసరి. ముందుగా తాము కట్టాలనుకుంటున్న నిర్మాణాల వివరాలను ఆ విభా గానికి దరఖాస్తుతోపాటు అందజేయాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)కు అనుగుణంగా ఉన్న స్థలంలో భవనాన్ని ఎంతమేర విస్తీర్ణంలో నిర్మించాలి? ఖాళీ స్థలం ఎంత వదలాలో నిర్ణయిస్తారు. అనంతరమే నిర్మాణాలు ప్రారంభించాలి. కానీ ఎక్కడా వారు సూచించిన ప్రకారం నిర్మాణాలు జరగడం లేదు. అనుమతులు తీసుకున్న తర్వాత చట్టాలను ఉల్లంఘించి ఇష్టారీతిన నిర్మాణాలు చేస్తున్నారు. దీంతో కోట్ల రూపాయలలో ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. ఉదాహరణకు రెండు అంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకుని ఐదంతస్తులు నిర్మిస్తే అక్రమంగా కట్టిన మూడంతస్తులపై ఆదాయం కోల్పోయినట్లే. ఇందుకోసం ప్ర ణాళిక విభాగం అధికారులకు అమ్యామ్యాలు సమర్పిస్తున్నారు. గుర్తిస్తున్నారు.. వసూలు చేస్తున్నారు ప్రతి నిర్మాణానికి రెవెన్యూ విభాగం ఏటా రెండుసార్లు పన్నులు వసూలు చేస్తుంది. భవనాలకు, ఖాళీ స్థలాలకు పన్ను విధించే సమయంలోనే అన్నిరకాల పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే నగర, పురపాలకశాఖల నిర్దేశాల మేరకు పన్ను నిర్ణయిస్తారు. భవనాలు, నిర్మాణాలకు పట్టణ ప్రణాళిక విభాగం నుంచి అనుమతి లేకుంటే 10 శాతం అదనపు పన్ను విధిస్తున్నారు. అయితే, వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఉంటే వందల సంఖ్యలోని నిర్మాణాలకే రెవెనూ ్య సిబ్బంది అదనపు పన్నులు విధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వసూళ్ల దందాలో మరోకోణం కామారెడ్డి, బోధన్ పురపాలక సంఘాలలో గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్థుల (జీ+టూ)కే అనుమతి ఉంది. అంతకు మించితే నిజామాబాద్ ప్రణాళిక ప్రాంతీయ సంచాలకుల అనుమతికి పంపాల్సిందే. అన్నీ సక్రమంగా ఉన్నా జీ ప్లస్ టూ నిర్మాణం చేయాలంటే ఆయా పురపాలక సంఘాలలో 100 చ.మీ.లోపు నిర్మాణానికి రూ. 25 వేలు, 200 చ.మీ.లోపు అయితే రూ.50 వేల పైచిలుకు మామూళ్లు సమర్పించుకోవాల్సి వస్తోందని నిర్మాణదారులు వాపోతున్నారు. నిర్మాణాలు ముందే మొదలుపె ట్టి తర్వాత అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునేవారికి కూడా ప్రత్యేక ధరలు ఉన్నాయి. చిన్నపాటి గృహాలు అయితే రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు, అదే 20 0 చ.మీ. పైన భవనాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించేవారి నుంచి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఉన్నతాధికారులకు తాము ఏదో ఒకటి చేస్తున్నామని తెలియజేయడానికి మూడు నుంచి ఐదంతుస్తుల నిర్మాణాలకు ముందుగా సెల్లార్లకే తాఖీదులు అందజేస్తారు. ఏళ్లపాటు ఇదే కొనసా గించి తర్వాత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వదిలేస్తున్నారు. నిజామాబాద్‌లో ఇలా.. ఇల్లు, భవంతి, వాణిజ్య సముదాయం... ఇలా ఏది నిర్మించాలన్న ముందుగా ప్లానర్ వద్దకు వెళ్లాల్సిందే. ఏ నిర్మాణానికి ఎంత మొత్తంలో ధరలు ఉంటాయో వారు తెలియజేస్తారు. ప్లాన్ తయారు చేసిన అనంతరం వారే పట్టణ ప్రణాళిక విభాగం వారితో మాట్లాడతారు. పురపాలక శాఖకు చలానాల రూపంలో చెల్లించాల్సిన వాటితో పాటు అధికారులకు ఎంత మొత్తంలో ఇవ్వాలో స్పష్టంగా యజమానులకు తెలుపుతారు. అంగీకరించిన అనంతరమే దరఖాస్తు ముందుకు వెళ్తుంది. చాలా వరకు ప్లానర్లే దరఖాస్తులకు ధరలు మాట్లాడుకుని అఫ్రూవల్ చేయించడం రివాజుగా మారింది. సెల్లార్లో వ్యాపారాలు నిర్వహించేందుకు అనుమతి లేదు. సెల్లార్లను విధిగా పా ర్కింగ్‌కు వదిలేయాల్సిందే. చట్టాన్ని అతిక్రమించి సెల్లార్‌ను 50 చదరపు మీటర్లలోపు నిర్మిస్తే రూ.20 వేలు మామూళ్లు అందజేయాల్సిందే. అంతకు మించితే రూ.50 వే ల నుంచి రూ.1 లక్ష వరకు యథేచ్ఛగా మామూళ్లు దండుకుంటున్నారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి * బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి నగ ర పాలక సంస్థ లేదా మున్సిపల్ పరిపాలన శాఖ నుంచి అనుమతులు పొం దాలి * ప్రతి బహుళ అంతస్తుల భవనం వద్ద ఇంకుడు గుంత తప్పనిసరి * నిర్మాణ స్థలంలో 10 శాతాన్ని ముందుగానే మున్సిపాలిటీలకు తనఖా పెట్టాలి * బహుళ అంతస్తు నిర్మాణానికి కనీసం రెండు వందల చదరపు గజాల విస్తీర్ణం గల స్థలం ఉండాలి * నిర్మించే స్థలానికి కనీసం రెండు వైపులా 30 అడుగుల రోడ్డు ఖచ్చితంగా ఉండాలి * భవన నిర్మాణానికి సెట్ బ్యాక్ (ఖాళీ స్థలం)గా 1.5 మీటర్ల నుంచి 3 మీటర్లు విస్తీర్ణాన్ని బట్టి వదలాలి * అనుమతి పొందిన అంతస్తుల కంటే అదనంగా నిర్మించకూడదు. పెంట్ హౌస్‌లు నిర్మించడం నేరం * భవన నిర్మాణం ఖచ్చితమైన సాంకేతిక ప్రమాణాలతో నిర్మించాలి. దీనికి గుర్తింపు పొందిన ఇంజినీరు నుంచి సామర్థ్య ధ్రువీకరణ పత్రం పొందాలి * భవనానికి పునాదులు కీలకం. నేల రకాన్ని బట్టి పునాదులు నిర్మించాలి. * సెల్లార్ పేరుతో భూమిని 20 అడుగుల వరకు తవ్వి నిర్మాణం ప్రారంభిస్తున్నారు. భూమి లోపల రెండు అంతస్థులు నిర్మిస్తున్నారు. ఇది నిషిద్ధం. * నేల స్వభావాన్ని బట్టి, ఎత్తు, విస్తీర్ణాన్ని బట్టి పునాదులు పటిష్టంగా నిర్మించాలి. కాంక్రీటు బలంగా వాడాలి. 1:2:4 నిష్పత్తిలో కాంక్రీటు వేయాలి -
కో ఆప్షన్ పదవులు ఏకగ్రీవం
నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మంగళవారం కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మేయర్ ఆకుల సుజాత అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో కో ఆప్షన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు తమకు కూడా ఓ పదవి ఇవ్వాలని కోరినప్పటికీ మేయర్, ఎమ్మెల్యే నిరాకరించారు. దీంతో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎన్నికను బహిష్కరిస్తున్నామని ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. 38 దరఖాస్తులు ఐదు కో ఆప్షన్ సభ్యుల పదవుల కోసం మొత్తం 38 దరఖాస్తులు రాగా, 17 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. సమావేశం ప్రారంభంకాగానే కాంగ్రెస్ కార్పొరేటర్లు సాయిరాం, దారంసాయిలు లేచి తమ పార్టీకి కూడా ఓ కో ఆప్షన్ పదవి ఇవ్వాలని కోరారు. బోధన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు ఒక పదవి ఇచ్చారని గుర్తు చేశారు. అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఇందుకు నిరాకరించారు. బోధన్‌లో లోపాయికారీ ఒప్పందంతోనే ఒక పదవి కాంగ్రెస్‌కు ఇచ్చారని, ఇక్కడ అలాంటి ఒప్పందం ఏదీ లేనందున పదవి ఇవ్వటం సాధ్యం కాదని స్పష్టం చేశారు. తాను మొదటి నుంచి అన్ని పార్టీల సభ్యులతో కలిసి నగరాన్ని అభివృద్ధి చేద్దామనే చెబుతున్నానని, కలిసిరాకపోతే తానేమి చేయలేనన్నారు. అనంతరం కాంగ్రెస్ కార్పొరేటర్లు కో ఆప్షన్ ఎన్నికను బహిష్కరిస్తున్నామని ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. ఆ తరువాత కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగింది. అనుభవం కలిగిన ముగ్గురిని, అల్ప సంఖ్యాక వర్గాల నుంచి ఇద్దరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కో ఆప్షన్ సభ్యులు వీరే అనుభవజ్ఞుల కోటాలో ఎన్పీడీసీఎల్ విశ్రాంత ఏడీఈ పి. నారాయణరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి. చంద్రం, మాజీ కౌన్సిలర్ కొత్తపేట పద్మను ఎన్నుకు న్నారు. అల్ప సంఖ్యాక వర్గాల కోటాలో సామాజిక సేవకుడు, ఎంఐఎంకు చెందిన సయ్యద్ కైసర్, టీఆర్ఎస్కు చెందిన రింకీకౌర్ ఎన్నికయ్యారు. దరఖాస్తు చేసుకోనప్పటికీ ఈమెకు అవకాశం లభించడం విశే షం. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఫయీమ్, ఇన్చార్జి కమిషనర్ మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ ఏక పక్ష నిర్ణయం కో ఆప్షన్ సభ్యుల ఎన్నికను ఎమ్మెల్యే, మేయర్ ఏక పక్షంగా నిర్వహించారని కాంగ్రెస్ కార్పొరేటర్లు దారం సాయిలు, మాయవార్ సాయిరాం విమర్శించారు. నగర అభివృద్ధికి అన్ని పార్టీలను కలుపుకుని పోతామని చెప్పినా, తమను ఏ మాత్రం పట్టించుకోవటం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి సమావేశంలో ఎమ్మెల్యే తమకు తగిన ప్రాధాన్యం ఇస్తామని చెబుతూనే అన్యాయం చేస్తూ వచ్చార ని అన్నారు. ఇకపై అధికార పార్టీ అగడాలను సహించబోమని హెచ్చరించారు. -
టికెట్ల కేటాయింపులో డీ‘ఎస్’ మార్క్!
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో తన ఆధిపత్యాన్ని నిలుపుకునే దిశగా పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డీ. శ్రీనివాస్ పావులు కదిపారు. బల్దియా బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను సోమవారం ఖరారు చేశారు. ఇందులో పలువురు సీనియర్ల పేర్లు గల్లంతు కావడం, మిగతా సీనియర్ నాయకుల ప్రతిపాదనలకు స్థానం లేకపోవడం సిటీలో చర్చనీయాంశంగా మారింది. అనుకూలంగా ఉన్నవాళ్లకే కార్పొరేషన్లో టికెట్ల కేటాయింపులో ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్, మాజీ మేయర్ సంజయ్ తమ ఆధిపత్యం నెగ్గించుకున్నారు. తమకు అనుకూలంగా ఉన్నవారికి టికెట్లు ఇప్పించుకున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. టికెట్లు ఆశించిన జెండాగుడి మాజీ చైర్మన్ నాని, సీనియర్ నాయకుడు శ్రీహరికి టికెట్లు రాకపోవడం వెనుక డీఎస్ అనుచరుల హస్తం ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. మైనార్టీ నాయకుడు అబ్ధుల్‌కు చెందిన వారికీ టికెట్లు కేటాయించలేదు. ప్రతిష్టాత్మకంగా మారిన 50వ డివిజన్లో ఇద్దరు బలమైన నాయకులున్నా ఛాగుభాయ్కి కేటాయించారు. సీనియర్లకు చుక్కెదురు కార్పొరేషన్లో టికెట్ల కేటాయింపులో ముఖ్యమైన నాయకులకు చుక్కెదురైంది. మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు తాహెర్బిన్ల పాత్ర నామమాత్రం కూడా లేకుండా పోయింది. వీరు తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడంలో విఫలమయ్యారు. తాహెర్బిహన్కు తెలియకుండానే టికెట్ల కేటాయింపు జరిగింది. డీఎస్‌కు ముఖ్య అనుచరుడిగా పేరున్న రత్నాకర్, ఆయనకు సన్నిహితంగా మరో విద్యార్థి నాయకుడు తమ వారికి టికెట్లు ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. డీఎస్ మరో ముఖ్యఅనుచరుడైన వేణు, ఇతర నాయకులు ప్రతిపాదనలనే టికెట్ల కేటాయింపులో పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానాన్ని తిరిగి హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంతోనే డీఎస్ మున్సిపల్ కార్పొరేటర్ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టికెట్ల కేటాయింపు చేసినట్లు పేర్కొంటున్నారు. మరోవైపు తమకు, తమ అనుచరులకు టికెట్లు కేటాయించకపోవడంతో పలువురు నాయకులు గుర్రుగా ఉన్నారు. -
‘మున్సిపల్’ రిజర్వేషన్ల ఖరారు
కార్పొరేషన్, న్యూస్‌లైన్ : మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల చైర్మన్ల, వార్డు స్థానాల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులను వెలువరించింది. నిజామాబాద్ నగర పాలక సంస్థ, కామారెడ్డి, ఆర్మూర్ మున్సిపాలిటీల చైర్మన్ స్థానాలు జనరల్ మహిళలకు రిజర్వ్ అయ్యాయి. బోధన్ చైర్మన్ స్థానం మాత్రం జనరల్ అయ్యింది. గతేడాది సెప్టెంబర్‌లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. అయితే మున్సిపల్ కార్పొరేషన్ల డివిజన్ల రిజర్వేషన్లు, మేయర్ల, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ప్రకటించే సమయంలో రాష్ట్ర విభజన అంశం ఊపందుకోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. బల్దియలకు మూడేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. కోర్టులు జోక్యం చేసుకొని బల్దియాలకు ఎన్నికలు నిర్వహించాలని జనవరిలో ఆదేశించడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రిజర్వేషన్లను ఖరారు చేయడంతో ఆశావహుల్లో ఆనందం ఉరకలెత్తుతోంది. తమ వార్డుల్లో, డివిజన్లలో పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్న నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకోగా.. రిజర్వేషన్ల ఖరారుతో ఇక కార్యరంగంలోకి దూకడానికి సన్నద్ధమవుతున్నారు. కాగా రిజర్వేషన్లు పలువురు ఆశావహుల ఆశలపై నీళ్లు గుమ్మరించాయి. తమ స్థానాలు రిజర్వ్ కావడంతో జనరల్ అభ్యర్థులు డీలా పడిపోయారు.