నోటిమాట... నోటు వాటా | City, towns and indulged in illegal constructions | Sakshi
Sakshi News home page

నోటిమాట... నోటు వాటా

Published Sun, Oct 26 2014 4:05 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

నోటిమాట... నోటు వాటా - Sakshi

నోటిమాట... నోటు వాటా

* అంతస్తులపై అంతస్తుకు ఇవే ప్రమాణాలు
* నగరం,పట్టణాలలో యథేచ్ఛగా అక్రమకట్టడాలు
* ప్రణాళిక అధికారులు, ప్రజాప్రతినిధులే సూత్రధారులు
* నిబంధనలను తుంగలో తొక్కుతున్న బిల్డర్లు
* చేష్టలుడిగిన పాలనా యంత్రాంగం
* అశోకా టవర్స్ ఘటనతో బయటపడ్డ లొసుగులు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరపాలక సంస్థ, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు పురపాలక సంఘాల పరిధిలో మొత్తం సుమారు 124 బహుళ అంతస్థు (అపార్టుమెంట్)ల సముదా యాలు ఉన్నాయి. వాటిలో 28 పైగా కట్టడాలు, నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ఖజానాకు నిధులు సమకూరేలా, నిబంధనలు కఠి నంగా అమలయ్యేలా వ్యవహరించాల్సిన అధికారులు భవన యజమానుల స్వార్థమే ఆసరాగా, తమ స్వలాభం చూసుకుంటున్నారు. రెవెన్యూ, పట్టణ ప్రణాళిక రెండూ ఒక శాఖలోని విభాగాలే. ఒకటి అక్రమ నిర్మాణాలు, కట్టడాలను నిరోధించి పట్టణాల రూపురేఖలు ప్రణాళికాబద్ధంగా ఉండేలా పర్యవేక్షించాలి.

మరొకటి నిర్మితమైన క ట్టడాలు, ఖాళీ స్థలాల నుంచి నగర, పురపాలక సంస్థలకు పన్నుల రూపంలో ఆర్థిక వనరులు సమకూర్చాలి. రెండు శాఖల మధ్యన సమన్వయం ఉంటే నగర, పురపా    లక సంఘాలకు కోట్ల రూపాయల ఆదాయం దక్కేది. అక్రమ నిర్మాణాలు చోటు చేసుకుంటున్నా పట్టణ ప్రణాళిక విభాగం జేబులు నింపుకొని కళ్లు మూసుకుంటోంది. రెవెన్యూ విభాగం అక్రమ నిర్మాణాలకు అదనపు రుసుము వసూలు చేసి చేతులు దులుపుకుంటోంది. రెండు శాఖల మధ్య సమన్వయాన్ని పెంచి ఆదాయం చేకూరేలా చ ర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఒక ప్రణాళిక అంటూ లేకుండా నిర్మా ణాలు కొనసాగుతుండటంతో నగరం, పట్టణాల రూపురేఖలు మారిపోతున్నాయి.
 
అవినీతి దరువు

పట్టణాలలో ఏ చిన్న నిర్మాణం చేపట్టాలన్నా పట్టణ ప్రణాళిక విభాగం అనుమతి తప్పనిసరి. ముందుగా తాము కట్టాలనుకుంటున్న నిర్మాణాల వివరాలను ఆ విభా గానికి దరఖాస్తుతోపాటు అందజేయాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)కు అనుగుణంగా ఉన్న స్థలంలో భవనాన్ని ఎంతమేర విస్తీర్ణంలో నిర్మించాలి? ఖాళీ స్థలం ఎంత వదలాలో నిర్ణయిస్తారు. అనంతరమే నిర్మాణాలు ప్రారంభించాలి. కానీ ఎక్కడా వారు సూచించిన ప్రకారం నిర్మాణాలు జరగడం లేదు. అనుమతులు తీసుకున్న తర్వాత చట్టాలను ఉల్లంఘించి ఇష్టారీతిన నిర్మాణాలు చేస్తున్నారు. దీంతో కోట్ల రూపాయలలో ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. ఉదాహరణకు రెండు అంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకుని ఐదంతస్తులు నిర్మిస్తే అక్రమంగా కట్టిన మూడంతస్తులపై ఆదాయం కోల్పోయినట్లే. ఇందుకోసం ప్ర ణాళిక విభాగం అధికారులకు అమ్యామ్యాలు సమర్పిస్తున్నారు.
 
గుర్తిస్తున్నారు.. వసూలు చేస్తున్నారు
ప్రతి నిర్మాణానికి రెవెన్యూ విభాగం ఏటా రెండుసార్లు పన్నులు వసూలు చేస్తుంది. భవనాలకు, ఖాళీ స్థలాలకు పన్ను విధించే సమయంలోనే అన్నిరకాల పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే నగర, పురపాలకశాఖల నిర్దేశాల మేరకు పన్ను నిర్ణయిస్తారు. భవనాలు, నిర్మాణాలకు పట్టణ ప్రణాళిక విభాగం నుంచి అనుమతి లేకుంటే 10 శాతం అదనపు పన్ను విధిస్తున్నారు. అయితే, వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఉంటే వందల సంఖ్యలోని నిర్మాణాలకే రెవెనూ ్య సిబ్బంది అదనపు పన్నులు విధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
 
వసూళ్ల దందాలో మరోకోణం
కామారెడ్డి, బోధన్ పురపాలక సంఘాలలో గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్థుల (జీ+టూ)కే అనుమతి ఉంది. అంతకు మించితే నిజామాబాద్ ప్రణాళిక ప్రాంతీయ సంచాలకుల అనుమతికి పంపాల్సిందే. అన్నీ సక్రమంగా ఉన్నా జీ ప్లస్ టూ నిర్మాణం చేయాలంటే ఆయా పురపాలక సంఘాలలో 100 చ.మీ.లోపు నిర్మాణానికి రూ. 25 వేలు, 200 చ.మీ.లోపు అయితే రూ.50 వేల పైచిలుకు మామూళ్లు సమర్పించుకోవాల్సి వస్తోందని నిర్మాణదారులు వాపోతున్నారు. నిర్మాణాలు ముందే మొదలుపె ట్టి తర్వాత అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునేవారికి కూడా ప్రత్యేక ధరలు ఉన్నాయి.

చిన్నపాటి గృహాలు అయితే రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు, అదే 20 0 చ.మీ. పైన భవనాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించేవారి నుంచి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఉన్నతాధికారులకు తాము ఏదో ఒకటి చేస్తున్నామని తెలియజేయడానికి మూడు నుంచి ఐదంతుస్తుల నిర్మాణాలకు ముందుగా సెల్లార్లకే తాఖీదులు అందజేస్తారు. ఏళ్లపాటు ఇదే కొనసా గించి తర్వాత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వదిలేస్తున్నారు.
 
నిజామాబాద్‌లో ఇలా..
ఇల్లు, భవంతి, వాణిజ్య సముదాయం... ఇలా ఏది నిర్మించాలన్న ముందుగా ప్లానర్ వద్దకు వెళ్లాల్సిందే. ఏ నిర్మాణానికి ఎంత మొత్తంలో ధరలు ఉంటాయో వారు తెలియజేస్తారు. ప్లాన్ తయారు చేసిన అనంతరం వారే పట్టణ ప్రణాళిక విభాగం వారితో మాట్లాడతారు. పురపాలక శాఖకు చలానాల రూపంలో చెల్లించాల్సిన వాటితో పాటు అధికారులకు ఎంత మొత్తంలో ఇవ్వాలో స్పష్టంగా యజమానులకు తెలుపుతారు. అంగీకరించిన అనంతరమే దరఖాస్తు ముందుకు వెళ్తుంది. చాలా వరకు ప్లానర్లే దరఖాస్తులకు ధరలు మాట్లాడుకుని అఫ్రూవల్ చేయించడం రివాజుగా మారింది. సెల్లార్‌లో వ్యాపారాలు నిర్వహించేందుకు అనుమతి లేదు. సెల్లార్లను విధిగా పా ర్కింగ్‌కు వదిలేయాల్సిందే. చట్టాన్ని అతిక్రమించి సెల్లార్‌ను 50 చదరపు మీటర్లలోపు నిర్మిస్తే రూ.20 వేలు మామూళ్లు అందజేయాల్సిందే. అంతకు మించితే రూ.50 వే ల నుంచి రూ.1 లక్ష వరకు యథేచ్ఛగా మామూళ్లు దండుకుంటున్నారు.
 
నిబంధనలు ఏం చెబుతున్నాయి
* బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి నగ ర పాలక సంస్థ లేదా మున్సిపల్ పరిపాలన శాఖ నుంచి అనుమతులు పొం దాలి
* ప్రతి బహుళ అంతస్తుల భవనం వద్ద ఇంకుడు గుంత తప్పనిసరి
* నిర్మాణ స్థలంలో 10 శాతాన్ని ముందుగానే మున్సిపాలిటీలకు తనఖా పెట్టాలి
* బహుళ అంతస్తు నిర్మాణానికి కనీసం రెండు వందల చదరపు గజాల విస్తీర్ణం గల స్థలం ఉండాలి
* నిర్మించే స్థలానికి కనీసం రెండు వైపులా 30 అడుగుల రోడ్డు ఖచ్చితంగా ఉండాలి
* భవన నిర్మాణానికి సెట్ బ్యాక్ (ఖాళీ స్థలం)గా 1.5 మీటర్ల నుంచి 3 మీటర్లు విస్తీర్ణాన్ని బట్టి వదలాలి
* అనుమతి పొందిన అంతస్తుల కంటే అదనంగా నిర్మించకూడదు. పెంట్ హౌస్‌లు నిర్మించడం నేరం
* భవన నిర్మాణం ఖచ్చితమైన సాంకేతిక ప్రమాణాలతో నిర్మించాలి. దీనికి గుర్తింపు పొందిన ఇంజినీరు నుంచి సామర్థ్య ధ్రువీకరణ పత్రం పొందాలి
* భవనానికి పునాదులు కీలకం. నేల రకాన్ని బట్టి పునాదులు నిర్మించాలి.
* సెల్లార్ పేరుతో భూమిని 20 అడుగుల వరకు తవ్వి నిర్మాణం ప్రారంభిస్తున్నారు. భూమి లోపల రెండు అంతస్థులు నిర్మిస్తున్నారు. ఇది నిషిద్ధం.
* నేల స్వభావాన్ని బట్టి, ఎత్తు, విస్తీర్ణాన్ని బట్టి పునాదులు పటిష్టంగా నిర్మించాలి. కాంక్రీటు బలంగా వాడాలి. 1:2:4 నిష్పత్తిలో కాంక్రీటు వేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement