
నిజామాబాద్ కార్పొరేషన్‌కు రూ. 54కోట్ల నిధులు
జీవో జారీ చేసిన కేటీఆర్
నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.54 కోట్ల నిధులు విడుదల చేస్తూ బుధవారం మంత్రి కేటీఆర్ జీవోను జారీ చేశారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో కేటీఆర్ తనను కలిసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాకు ఈ సందర్భంగా అందజేశారు. రూ. 100కోట్ల మంజూరీలో భాగంగా మొదట రూ. 54కోట్ల మంజూరుకు జీవో విడుదల కాగా రూ. 46కోట్లను త్వరలో మంజూరు చేయనున్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.