release of funds
-
మా జన్మ ధన్యమైంది
సాక్షి, హైదరాబాద్: రైతులకు రుణమాఫీతో తమ జన్మ ధన్యమైందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏ రైతు కుటుంబంలోనూ విషాదం ఉండకూడదని, రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. ఈ మాఫీతో లక్షలాది మంది రైతుల ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు.రైతు రుణమాఫీ రెండో విడతలో భాగంగా రూ.1.50 లక్షల్లోపు రుణమున్న రైతుల రుణమాఫీ కోసం రూ.6,190 కోట్ల నిధులను మంగళవారం ఆయన విడుదల చేశారు. 5.9 లక్షల కుటుంబాలకు చెందిన 6.4 లక్షల బ్యాంకు ఖాతాలకు సంబంధించిన చెక్కును రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. వ్యవసాయం పండుగ అని నిరూపించేందుకే ‘కార్పొరేట్లకు వేలాది కోట్ల రూపాయలను బ్యాంకులు అప్పులుగా ఇస్తే, నష్టాల పాలయ్యామంటూ తప్పుడు లెక్కలు చూపెట్టి రుణాలు ఎగ్గొట్టి దేశాలు విడిచి పారిపోతున్నారు. కానీ రైతులు మాత్రం తాను అప్పులపాలైనా పదిమందికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో రుణాలు తీసుకుంటారు. అప్పుల వాళ్లు ఇంటికొస్తే ఆత్మాభిమానం దెబ్బతిని సిరులు పండించే పొలాల్లోనే పురుగుల మందు తాగి చనిపోయిన ఘటనలు జరిగాయి. అందుకే వరంగల్ డిక్లరేషన్‌లో రైతు రుణమాఫీ ప్రకటించాం. సోనియా, రాహుల్‌గాం«దీలిచి్చన మాట మేరకు వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించేందుకు రుణమాఫీ చేస్తున్నాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. తొలి విడత తర్వాత రెండు వారాలు కాకుండానే.. ‘రైతులకు రుణమాఫీ చేస్తామంటే ఎలా చేస్తారని కొందరు శాపనార్థాలు పెట్టారు. కానీ మా చిత్తశుద్ధి, పరిపాలన దక్షతతో చేసి చూపించాం. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని శంకించలేరు.. ప్రణాళికలను ప్రశ్నించలేరు. తొలి విడత రైతు రుణమాఫీ చేసిన తర్వాత రెండు వారాలు కూడా కాకముందే రెండో విడత రుణమాఫీ చేస్తున్నాం.ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలలు చరిత్రలో లిఖింపదగినవి. గత ప్రభుత్వం రూ.7 వేల కోట్లు మాఫీ చేయకుండా చేతులెత్తేసింది. వారు పాలించిన 120 నెలల కాలంలో రుణమాఫీ కోసం రూ.25 వేల కోట్లు కూడా చెల్లించలేకపోయింది. మేం మాత్రం అధికారంలోకి వచి్చన 8 నెలల కాలంలోనే ఏకకాలంలో రుణమాఫీ చేసి, 12 రోజుల వ్యవధిలోనే రెండుసార్లు నిధులు విడుదల చేశాం. రైతుల కోసమే ఈ రికార్డు 75 ఏళ్ల భారత స్వాతంత్య్ర చరిత్రలో ఏ రాష్ట్రం కూడా రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేయలేదు. ఇలా చేయడం ఓ రికార్డు. ఈ రికార్డు తెలంగాణ ప్రజల కోసమే. సాధారణంగా ఎన్నికలున్నప్పుడు ఓట్లడిగే సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు ఇలాంటివి చేస్తుంటాయి. మేము మాత్రం రైతు ప్రయోజనాలే ధ్యేయంగా ఓట్లు లేనప్పుడు కూడా రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలబడతామనే విశ్వాసాన్ని కలిగించాం..’అని రేవంత్ చెప్పారు. మా నిబద్ధతను భట్టి అన్న నిరూపించారు ‘బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి వెళ్లిపోతే.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 8 నెలల్లోనే రూ.43 వేల కోట్లు పాత అప్పులు, వడ్డీలకు కట్టారు.సామాజిక పింఛన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, ఆరోగ్యశ్రీ, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లకు అనుమతి, అంగన్వాడీల నుంచి ఆశా వర్కర్ల వరకు వేతనాలు.. ఇలా ఏ కార్యక్రమం ఆగకుండానే రైతు రుణమాఫీకి భట్టి అన్న నిధులు సమకూర్చారు. మా నిబద్ధతను నిరూపించారు. ఇందుకు ఆర్థిక శాఖ అధికారులు సహకరించారు..’అంటూ సీఎం అభినందించారు. సంకల్ప బలమే కారణం: డిప్యూటీ సీఎం భట్టి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతు రుణమాఫీ కోసం రాష్ట్రంలోని 16.29 లక్షల రైతు కుటుంబాలకు చెందిన 17.91 లక్షల ఖాతాల్లో రూ.12,208 కోట్లు జమ చేశామని తెలిపారు. ‘రుణమాఫీ ఎప్పుడో చేస్తారులే అన్న ఊహలు పటాపంచలు చేశాం. ఇందుకు సంకల్ప బలమే కారణం. ప్రతి క్షణం ప్రజలకు మేలు చేసేందుకే మేం తపిస్తున్నాం.అందుకే ఒక్కరోజు కూడా అలస్యం కాకూడదనే ఉద్దేశంతోనే ఈనెల 15న రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసి, 18న మొదటి విడత నిధులిచ్చాం. మళ్లీ రెండు వారాలు పూర్తి కాకుండానే ఇప్పుడు రెండోవిడత నిధులు విడుదల చేశాం. రూ.2 లక్షల లోపు రుణమాఫీ ఆగస్టు నెలలో పూర్తి చేస్తాం. రైతులకిది పండుగ రోజు. బ్యాంకుల్లో ఉన్న అప్పుల భారం దిగిపోతుంటే వారు సంతోషంగా ఉన్నారు..’అని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: మంత్రి తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అప్పుల్లో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుతూనే రైతులకు ఇచి్చన మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. రుణమాఫీకి నిధులు విడుదల చేసినందుకు గాను రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలిపారు. రుణమాఫీ కాని రైతులు వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లి రైతు సమాచార పత్రం తీసుకుని తమ సమస్యలు తెలియజేయాలని, నెలరోజుల్లో అర్హులైన అందరు రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమ చేయించే బాధ్యత వ్యవసాయ శాఖదని చెప్పారు.ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులు, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు బకాయిలు చెల్లింపు
రేణిగుంట(తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా గాజులమండ్యం ఎస్వీ సహకార చక్కెర కర్మాగారం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన బకాయిలను చెల్లించింది. 368 మంది కార్మికులకు 9 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.21.36 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల విడుదల చేశారు. బుధవారం ఫ్యాక్టరీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యంతో కలిసి మంత్రి రోజా.. కార్మికులకు చెక్కులు పంపిణీ చేశారు. రేణిగుంట మండలం గాజులమండ్యంలోని శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగారాన్ని చంద్రబాబు అధికారంలోకి రాగానే 2014లో మూసివేశారు. కానీ కార్మికులకు వేతన బకాయిలు చెల్లించలేదు. దీంతో కార్మికులు పని కోల్పోయి.. వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి సమస్య తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 368 మంది కార్మికులకు అందాల్సిన బకాయిలు మొత్తం రూ.21.36 కోట్లను విడుదల చేశారు. వాటిని బుధవారం మంత్రి రోజా అందజేయగా.. కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్య తెలియగానే నిధులు విడుదల చేసిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ జీవితాల్లో సీఎం జగన్ వెలుగులు నింపారని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ ఎండీ రవిబాబు తదితరులు పాల్గొన్నారు. -
వెయ్యి కోట్ల డాలర్లను విడుదల చేయండి
ఓస్లో: అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లు తొలిసారిగా పశ్చిమ దేశాల ప్రతినిధులతో అధికారికంగా సమావేశమై చర్చించారు. నార్వే రాజధాని ఓస్లోలో మూడు రోజుల పాటు జరుగుతున్న సమావేశాల్లో పాల్గొన్న తాలిబన్ ప్రతినిధులు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు స్తంభింపజేసిన వెయ్యి కోట్ల అమెరికా డాలర్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అఫ్గానిస్తాన్ మానవ సంక్షోభం అంచులో ఉందని అందుకే ఆ నిధులు విడుదల చేయాలని వారు ఒత్తిడి తీసుకువచ్చారు. తాలిబన్ల తరఫున హాజరైన షఫీవుల్లా అజామ్ ఈ సమావేశంలో మాట్లాడుతూ అఫ్గానిస్తాన్‌కు చెందిన ఆస్తుల్ని విడుదల చేయాలని, రాజకీయపరమైన విభేదాలతో సాధారణ పౌరుల్ని శిక్షించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆకలి కేకలు, గడ్డ కట్టించే చలి పరిస్థితుల్లో స్తంభింపజేసిన ఆస్తుల్ని విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశానికి ముందు పశ్చిమ దేశాల ప్రతినిధులు అఫ్గాన్ మహిళా హక్కుల కార్యకర్తలు, మానవ హక్కుల కార్యకర్తలతో మాట్లాడి అఫ్గాన్‌లో క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. -
దేశాభివృద్ధి ఆగదు
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో భారత్ మరింత రెట్టించిన ఉత్సాహంతో అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ప్రధాని మోదీ అభిలషించారు. కోవిడ్ విసిరే సవాళ్లు దేశాభివృద్ధికి విఘాతం కలిగించడాన్ని భారత్ ఏమాత్రం అనుమతించబోదని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘ జాతి ప్రయోజనాలే పరమావధిగా పూర్తి అప్రమత్తతతో, ముందస్తు జాగ్రత్తలతో కోవిడ్‌పై పోరును భారత్ కొనసాగిస్తుంది’ అని మోదీ ప్రకటించారు. శనివారం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకం పదో విడత నిధుల విడుదల సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. 2021 ఏడాదిలో కోవిడ్ కల్లోక కాలంలోనూ ఆరోగ్య, రక్షణ, వ్యవసాయ, మౌలిక సదుపాయాలు, అంకుర సంస్థల రంగాలు సాధించిన పురోగతిని మోదీ గుర్తుచేశారు. ‘ భిన్న రంగాల్లో సంస్కరణలు వేగం పుంజుకున్నాయి. ఆధునిక మౌలిక సదుపాయాలను భారత్ సమకూర్చుకుంది. ఈ అభివృద్ధి పథాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఈ క్రమంలో ఎదురయ్యే కోవిడ్ సవాళ్లను భారత్ ఎంతమాత్రం అనుమతించబోదు. గత సంవత్సరాల ఘన విజయాల నుంచి స్ఫూర్తి పొంది దేశం నూతన సంవత్సరంలో కొత్త ప్రయాణం మొదలుపెడుతోంది’ అని మోదీ అన్నారు. ‘కోవిడ్ సంక్షోభ కాలంలో రూ.2.6 లక్షల కోట్ల విలువైన ఆహార ధాన్యాలను మొత్తంగా 80 కోట్ల ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశాం. కొత్త ఆక్సిజన్ ప్లాంట్లు, కొత్త వైద్య కళాశాలలు, వెల్నెస్ సెంటర్లు, ఆయుష్మాన్ భారత్ మిషన్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్లతో దేశ వైద్య మౌలిక వ్యవస్థను మరింత పటిష్టంచేశాం’ అని మోదీ చెప్పారు. ఎన్నో అంశాల్లో కోవిడ్‌కు ముందునాటి ఆర్థిక గణాంకాలను దాటేందుకు భారత ఆర్థికవ్యవస్థ సిద్ధమైందన్నారు. సెమీ కండక్టర్ల(చిప్‌లు) తయారీ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేందుకు భారత్ పటిష్ట ప్రణాళికలతో ముందుకెళ్తోందని ఆయన చెప్పారు. 10 కోట్ల రైతులకు రూ.20,946 కోట్లు పీఎం–కిసాన్ పథకం పదో విడత నిధుల విడుదలలో భాగంగా శనివారం ప్రధాని మోదీ 10.09 కోట్ల రైతులకు పంపిణీ చేసేందుకు రూ.20,946 కోట్లు విడుదలచేశారు. వినూత్న సాగు పద్దతులు, ప్రకృతి వ్యవసాయం వైపు వ్యవసాయం మళ్లాల్సిన ఆవశ్యకతను ప్రధాని గుర్తుచేశారు. పీఎం–కిసాన్ కింద అర్హులైన రైతు కుటుంబానికి కేంద్రం ఏటా రూ.6,000 నగదు సాయం చేస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో ఇస్తారు. 2019 బడ్జెట్ సందర్భంగా పీఎం–కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటిదాకా మోదీ సర్కార్ మొత్తంగా రూ.1.8 లక్షల కోట్ల నిధులను రైతులకు పంపిణీ చేసింది. మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త ఏడాది తొలిరోజున ప్రధాని మోదీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ మంచి ఆరోగ్యంతో, ఆనందంతో జీవించాలని ఆయన అభిలషించారు. -
జీఎస్టీ లోటు భర్తీ...
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) లోటును భర్తీ చేయడానికి కేంద్రం గురువారం రూ.44,000 కోట్లను రుణంగా రాష్ట్రాలకు విడుదల చేసింది, దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా నిధుల విడుదల పరిమాణం మొత్తం రూ.1.59 లక్షల కోట్లకు చేరుకుంది. నిధులను బ్యాక్–టు–బ్యాక్ లోన్లుగా విడుదల చేయడం... సెస్ వసూళ్ల నుండి ఇచ్చే ద్వైమాసిక జీఎస్టీ పరిహారానికి అదనం. 2021–22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ. 1.59 లక్షల కోట్ల రుణ సమీకరణలు జరపాలని, ఈ నిధులను (జీఎస్టీ పరిహార నిధిలో లోటు భర్తీకి) వనరుల అంతరాన్ని తీర్చడానికి ఒక బ్యాక్–టు–బ్యాక్ ప్రాతిపదికన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేయాలని ఈ ఏడాది మే 28వ తేదీన జరిగిన 43వ జీఎస్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశం నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరం ఈ విధంగా ఇదే విధానం ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం రూ. 1.10 లక్షల కోట్లు విడుదల చేసింది. -
‘దళిత బంధు’ పథకానికి రూ.250 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశాలతో ‘దళిత బంధు’ పథకానికి రూ.250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిధుల విడుదల ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మ జిల్లా చింతకాని మండలానికి రూ.100 కోట్లు, సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మండలానికి రూ.50 కోట్లు, నాగర్‌కర్నూలు జిల్లా చారగొండ మండలానికి రూ.50 కోట్లు, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలానికి రూ.50 కోట్లు విడుదల చేశారు. (చదవండి: Dalit Bandhu: హుజురాబాద్‌లో దళిత బంధుకు బ్రేక్) కాగా, ఉప ఎన్నిక నేపథ్యంలో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో వెంటనే నిలిపివేయాలని సీఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా ఓటర్లు ప్రలోభానికి లోనుకాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఉపఎన్నిక తర్వాత దళితబంధును యధావిథిగా కొనసాగించవచ్చని సూచించింది. చదవండి: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్! -
పోలవరం ప్రాజెక్టుకు రూ.745.94 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాజెక్టు పనులకు ఆటంకం కలగకుండా చూడటంతో పాటు.. మరింత వేగవంతం చేయడానికి రూ.745.94 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులకు 2021–22 బడ్జెట్లో త్రైమాసిక ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్‌సింగ్ రావత్ శనివారం ఉత్తర్వులిచ్చారు. పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. గోదావరికి వరదలు వచ్చేలోగా చేయాల్సిన పనులను శరవేగంగా పూర్తి చేయడం కోసం.. నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటోంది. నిర్వాసితులకు వీలైనంత వేగంగా పునరావాసం కల్పించడంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే నిధులు విడుదల చేసింది. చదవండి: World Bank: మిగతా రాష్ట్రాల కంటే ఏపీ బెస్ట్ అర్ధరాత్రి హైవేపై.. సినిమాను తలపించే రీతిలో -
ఎయిమ్స్‌కు నిధులివ్వండి
కేంద్ర మంత్రికి బూర నర్సయ్యగౌడ్ వినతి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు త్వరితగతిన నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఇక్కడ మంత్రిని కలసిన ఆయన వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన మంత్రి సంబంధిత ఫైలును ఆర్థిక శాఖకు పంపామని, త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే భువనగిరి పరిధిలో రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు ఎంపీ బూర లేఖ రాశారు. -
రుణమాఫీకి రూ.19.22 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: చివరి విడత రుణమాఫీకి విడుదల చేసిన నిధులు సరిపోకపోవడంతో మరో రూ. 19.22 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడో విడత రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం రూ. 4,025 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, రూ. 4 వేల కోట్లే విడుదల చేసింది. ఈ సొమ్ము సరిపోదని జిల్లా వ్యవసాయాధికారులు విన్నవించడంతో ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. ఈ మేరకు పరిపాలనా అనుమతినిస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. -
నిజామాబాద్ కార్పొరేషన్‌కు రూ. 54కోట్ల నిధులు
జీవో జారీ చేసిన కేటీఆర్ నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.54 కోట్ల నిధులు విడుదల చేస్తూ బుధవారం మంత్రి కేటీఆర్ జీవోను జారీ చేశారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో కేటీఆర్ తనను కలిసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాకు ఈ సందర్భంగా అందజేశారు. రూ. 100కోట్ల మంజూరీలో భాగంగా మొదట రూ. 54కోట్ల మంజూరుకు జీవో విడుదల కాగా రూ. 46కోట్లను త్వరలో మంజూరు చేయనున్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
నేడు తుపాను సాయం రూ.1,000 కోట్లు విడుదల
న్యూఢిల్లీ: హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.1,000 కోట్లను కేంద్రం బుధవారం విడుదల చేయనున్నట్టు సమాచారం. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) నుంచి ఈ నిధులు విడుదల చేస్తున్నట్టుగా సమాచారం అందిందని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో భేటీ అనంతరం టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడుతో కలిసి ఏపీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వాల మాదిరి కాకుండా ప్రధాని హామీ మేరకు రూ.1,000 కోట్ల సాయం వెంటనే విడుదల కానుండడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలకు ఈ నిధులను కేటాయిస్తారని కంభంపాటి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మంత్రిని కలిశామని, నష్టపోయిన రైతులకు సహాయంతో పాటు పంటల బీమా అందేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు వచ్చిన వెంటనే కేంద్ర బృందాలను పంపుతామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. తుపాను కారణంగా ్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు.